twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో.. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడంటే?

    |

    మన హీరోలు బాలీవుడ్ వెండితెరపై కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఏకంగా అక్కడ లోకల్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అక్కడి దర్శకులు కూడా మన హీరోల డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రాబోయే సల్మాన్ ఖాన్ బిగ్ బడ్జెట్ సినిమాలో మన టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నాడని గతకొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయన ఇలాంటి పాత్రలో కనిపిస్తున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

    సల్మాన్ టాలీవుడ్ ఫోకస్

    సల్మాన్ టాలీవుడ్ ఫోకస్

    బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మొదటి నుంచి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పై స్పెషల్ ఫోకస్ ఉంది. అతను గతంలో చేసిన కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తెలుగులో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ అప్పట్లో ఎక్కువగా బాలసుబ్రహ్మణ్యం తోనే పాటలు పాడించుకునేవారు. ఆ మధ్య కాలంలో దబాంగ్ 3 సినిమాను కూడా తెలుగులో బాగానే ప్రమోట్ చేశాడు. కానీ అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

     అక్కడ మన హీరోలు

    అక్కడ మన హీరోలు

    ఇక ఇటీవల కాలంలో తెలుగు హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో అక్కడి అగ్ర హీరోలకు కూడా పోటీ గా నిలుస్తూ ఉన్నారు. ప్రభాస్ ఆ తర్వాత అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా వరుసగా వందల కోట్ల బిజినెస్ తో బాలీవుడ్ ను ఆకర్షించారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్ పై మరింత ఫోకస్ చేయాలి అని చూస్తున్నాడు.

    మెగాస్టార్ సినిమాలో..

    మెగాస్టార్ సినిమాలో..

    ముందుగా తెలుగు అగ్రహీరో సినిమా లో సల్మాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పాత్ర తప్పకుండా తెలుగువారికి మరింత దగ్గర చేస్తుంది అని సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

    కబీ ఈద్ కబీ దివాళి..

    కబీ ఈద్ కబీ దివాళి..

    అయితే సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో మరొక బిగ్ బడ్జెట్ సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. కబీ ఈద్ కబీ దివాళి అనే సినిమాను సల్మాన్ ఖాన్ ఎలాగైనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఒక టాలీవుడ్ అగ్రహీరో కూడా నటించబోతున్నట్లు గతంలోనే సల్మాన్ ఖాన్ ప్రమోషన్లు వివరణ ఇచ్చాడు.

    బలమైన పాత్రలో వెంకటేష్

    బలమైన పాత్రలో వెంకటేష్

    ఇక ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ అని అందరికీ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఆ సినిమాలో వెంకటేష్ కేవలం గెస్ట్ రోల్ లో కనిపించడం లేదట. ఫుల్ లెన్త్ రోల్ లోనే కథకు సంబంధం ఉన్న బలమైన పాత్రలో కనిపిస్తాడు అని తెలుస్తోంది. వెంకటేష్ ఒక ఒరిజినల్ తెలుగు హిందూ భక్తుడిగా ఆ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ వెంకటేష్ కు మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ గా నటించబోతోంది.

    English summary
    Tollywood star hero special role details in salman khan Kabhi eid kabhi diwali project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X