twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 100 కోట్లతో ఆ హీరో టాప్: స్టార్స్ సైడ్ ఇన్‌కం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే...

    |

    సినిమా రంగంలో క్లిక్ అయితే చాలు కార్పొరెట్ సంస్థలు ఆయా స్టార్లతో తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయించుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఈ ట్రెండ్ ఇపుడు సినిమా స్టార్లకు మెయిన్ ఇన్‌కంను మించిన ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ అందరి కంటే ముందు ఉన్నారు.

    సాధారణంగా బాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అంటారు. అయితే సినిమా సంపాదన విషయంలో వీరు టాప్ స్టార్స్ అవ్వొచ్చు కానీ... యాడ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదించే హీరోల్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అందరి కంటే టాప్ పొజిషన్లో ఉన్నారు.

    ఫ్రీ ప్రెస్ జర్నల్ సర్వేలో అక్షయ్ టాప్

    ఫ్రీ ప్రెస్ జర్నల్ సర్వేలో అక్షయ్ టాప్

    ఫ్రీ ప్రెస్ జర్నల్ తాజాగా విడుదల చేసిన ఓ సర్వేలో యాడ్స్, బ్రాండ్ ఎడార్స్మెంట్లతో అందరికంటే టాప్ పొజిషన్లో ఉన్నారట అక్షయ్. టాప్ 10 లిస్టులో ఈ తరం స్టార్స్ రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, వరుణ్ ధావన్, అలియా బట్ లాంటి వారు సైతం ఉన్నారు.

    రణవీర్ సింగ్‌కు డిమాండ్ ఎక్కువే

    రణవీర్ సింగ్‌కు డిమాండ్ ఎక్కువే

    ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో రూ. 100 కోట్ల విలువ చేసే యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు ఉన్నాయట. ఈ హీరో సైడ్ ఇన్ కం ఇంత పెద్ద మొత్తం ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. రూ. 84 కోట్ల సంపాదనతో రణవీర్ సింగ్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.

    భర్తతో పోటీ పడుతున్న దీపిక

    భర్తతో పోటీ పడుతున్న దీపిక

    బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్ సైతం ఈ విషయంలో తక్కువేమీ కాదు. రూ. 75 కోట్ల సైడ్ ఇన్ కంతో ఆమె తన మొగడితో పోటీ పడుతోంది. దీపిక తర్వాతి స్థానంలో రూ. 72 కోట్ల అదనపు ఆదాయంతో అమితాబ్ బచ్చన్ 4వ స్థానంలో ఉన్నారు.

    ఈ కుర్ర బ్యూటీ కూడా బాగా సంపాదిస్తోంది

    ఈ కుర్ర బ్యూటీ కూడా బాగా సంపాదిస్తోంది

    కుర్రబ్యూటీ అలియా భట్ సైతం యాడ్స్ ఫిల్మ్స్, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా భారీగా సంపాదిస్తోంది. ఈ అమ్మడు రూ. 68 రెట్ల వరకు సైడ్ ఇన్ కం తన ఖాతాలో వేసుకుంటోందట. వరుస ప్లాపుల కారణంగా షారుక్ డిమాండ్ తగ్గింది. అతడి సైడ్ సంపాదన ఇపుడు రూ. 56 కోట్లు మాత్రమే.

    ఇంత భారీ మొత్తంలో సైడ్ ఇన్‌కం

    ఇంత భారీ మొత్తంలో సైడ్ ఇన్‌కం

    వరుణ్ ధావన్ రూ. 48 కోట్లతో ఏడవ స్థానంలో, సల్మాన్ ఖార్ రూ. 40 కోట్లతో ఎనిమిదవ స్థానంలో, కరీనా కపూర్ రూ. 32 కోట్లతో తొమ్మిదవ స్థానంలో, కత్రినా కైఫ్ రూ. 30 కోట్ల సంపాదనతో 10వ స్థానంలో ఉంది. బాలీవుడ్ స్టార్స్ ఇంత పెద్ద మొత్తంలో అదనంగా సంపాదించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

    English summary
    Brand endorsements are a major part of Bollywood actor’s earnings. Leading daily, Free Press Journal has shared results of a survey which shows that Akshay Kumar leads the list of celebrity endorsements with 100 cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X