2018లో జరిగిన బిగ్గెస్ట్ మూవీ సెలబ్రిటీ వెడ్డింగ్స్

2018 సంవత్సరలో ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్లో వరుసగా పెళ్లి సందడి కనిపించింది. ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, నేహా ధూపియా, రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ ఇలా పలువురు స్టార్స్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

2018 జరిగిన అతిపెద్ద వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇషా అంబానీ వివాహం. వీరు సిని రంగానికి చెందిన వారు కాకపోయినా... పెళ్లి వేడుకలో మొదటి నుంచి చివరి వరకు బాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. అమితాబ్, షారుక్, సల్మాన్, ప్రియాంక లాంటి స్టార్స్ హాజరై... తమ సొంత ఇంట్లో పెళ్లి జరిగినట్లుగా హడావుడి చేశారు.

 బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్

బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్

దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమాల్‌తో డిసెంబర 12న జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. అమెరికా నుంచి బియాన్స్ వచ్చి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో... పాటు యూఎస్ఏ మాజీ ఫస్ట్ లేడీ హిల్లరీ క్లింటన్ సైతం ఈ వేడుకలో సందడి చేశారు.

ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్

ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్

ఈ ఏడాది జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ వివాహం ఒకటిగా చెప్పుకోవచ్చు. తన అమెరికన్ బాయ్‌ఫ్రెండ్ నిక్ జొనాస్‌ను ప్రియాంక డిసెంబర్ 1న పెళ్లాడింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్‌లో వీరి వివాహ వేడుక రాయల్ వెడ్డింగ్ స్టైల్‌లో వైభవంగా సాగింది. ఢిల్లీలో జరిగిన వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరైన సంగతి తెలిసిందే.

దీపిక-రణవీర్

దీపిక-రణవీర్

గత ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి చేసుకున్నారు. కొంకణి, సింధి సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.

 సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా

సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా

ఈ ఏడాది జరిగి మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ సెల్రబిటీ వెడ్డింగ్ సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం. మే 8న ముంబైలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

నేహా ధూపియా-అంగద్ బేడీ

నేహా ధూపియా-అంగద్ బేడీ

బాలీవుడ్ యాక్టర్స్ నేహా ధూపియా-అంగద్ బేడీ ఈ ఏడాది మే 10వ తేదీని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఈ దంపతులకు మెహర్ అనే అమ్మాయి జన్మించింది. పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చడంతో ఆ విషయం బయట పడకుండా ఉండటానికి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు టాక్.

 మిలింద్ సోమన్-అంకిత కోన్వర్

మిలింద్ సోమన్-అంకిత కోన్వర్

ఈ ఏడాది బాగా హైలెట్ అయిన వెడ్డింగ్ బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ వివాహం. 53 సంవత్సరాల మిలింద్ సోమన్ 27 సంవత్సరాల అంకింత కోన్వర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 22న కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి వివాహం జరిగింది.

హీరోయిన్ శ్రీయ వివాహం

హీరోయిన్ శ్రీయ వివాహం

హీరోయిన్ శ్రీయ తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రి కోచివ్‌ను ముంబైలో మార్చి 12న పెళ్లాడింది. టెన్నిస్ ప్లేయర్, వ్యాపార వేత్త అయిన ఆండ్రి కోచివ్‌‌... శ్రీయను ఎలా పడేసాడో? అంటూ అప్పట్లో అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు.

కపిల్ శర్మ-గిన్ని ఛాత్రత్

కపిల్ శర్మ-గిన్ని ఛాత్రత్

ప్రముఖ టీవీ కమెడియన్, బాలీవుడ్ నటుడు కపిల్ శర్మ తన ప్రియురాలు గిన్ని ఛాత్రత్‌ను డిసెంబర్ 12న పెళ్లాడిన సంగతి తెలిసిందే. జలంధర్‌లో వీరి వివాహం సాంప్రదాయ బద్దంగా జరిగింది.

దీపక కక్కర్-షోయబ్ ఇబ్రహీం

దీపక కక్కర్-షోయబ్ ఇబ్రహీం

ఈ ఏడాది బాగా హైలెట్ అయిన వివాహాల్లో టీవీ నటి దీపిక కక్కర్ వివాహం కూడా ఒకటి. తన కోస్టార్ షోయబ్ ఇబ్రహీంను ఫిబ్రవరి 22న మె పెళ్లాడారు.

యువికా చౌదరి, ప్రిన్స్ నరులా

యువికా చౌదరి, ప్రిన్స్ నరులా

బిగ్ బాస్ షో ద్వారా పరిచయం అయిన యూవికా చౌదరి, ప్రిన్స్ నరులా ప్రేమలో పడి... ఈ ఏడాది అక్టోబర్ 12న ముంబైలో వివాహం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X