ఇన్స్టాగ్రామ్ లో సూపర్ ఫాలోయింగ్.. టాప్ టెన్ హీరోయిన్స్ ఎవరో తెలుసా?

ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ గురించి పెద్దగా అన్ని విషయాలు బయటికి వచ్చేవి కావు. కానీ మారుతున్న ఈ కాలానికి తగ్గట్టు వాళ్లు కూడా మారిపోతూ తమ రోజు దైనందిన జీవితాలను కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా నిన్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి 4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు.. దీంతో అసలు ఇంస్టాగ్రామ్లో ఏ హీరోయిన్ కి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే అంశం చర్చకు వచ్చింది. ఇక దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

బాలీవుడ్ టాప్

బాలీవుడ్ టాప్

ఈ ఫాలోవర్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ చాలా వెనుకబడి ఉన్నారని చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పటికప్పుడు తమ అభిమానులను ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఇక ఆ విషయానికి వస్తే అందరి హీరోయిన్స్ లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అంటే అది ప్రియాంక చోప్రా అని చెప్పక తప్పదు.

ప్రియాంక నెంబర్ 1

ప్రియాంక నెంబర్ 1

ఈ గ్లోబల్ స్టార్ ఏకంగా 64.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి టాప్ పొజిషన్లో ఉంది. హాలీవుడ్ కి వెళ్ళిన ఈ భావ అక్కడే తనకంటే పదేళ్లు చిన్న వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక ప్రియాంక తర్వాతి స్థానంలో శ్రద్ధాకపూర్ నిలిచింది ఈ భామ కూడా ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 62.8 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ప్రియాంకకు పోటీ ఇస్తూ త్వరత్వరగా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటూ పెడుతోంది.

టాప్ టెన్ లిస్ట్ లో

టాప్ టెన్ లిస్ట్ లో

ఇక ఈ లిస్ట్ లో దీపికా పడుకొనే మూడో స్థానంలో నిలిచింది. ఒకపక్క హిందీ సినిమాలే కాక దక్షిణాదిన కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ 57.1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇక ఈ భామ తర్వాత అలియా భట్ కూడా ఈ మధ్య తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తుండడంతో ఈ భామకు కూడా పాన్ ఇండియా క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ భామకు 53.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో యమా యాక్టివ్

సోషల్ మీడియాలో యమా యాక్టివ్

ఈ భామ తర్వాతి స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 52.1 మిలియన్ ఫాలోవర్స్ తో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆమె తరువాత స్థానంలో అనుష్క శర్మ నిలిచింది ఆమె 50.4 మిలియన్ ఫాలోవర్స్ తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక కత్రినాకైఫ్ అయితే 50.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఏడవ స్థానంలో నిలిచింది.

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
టెన్త్ ప్లేస్ లో ఊర్వశి

టెన్త్ ప్లేస్ లో ఊర్వశి

ఇక ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేసే దిశా పటానీ 44.4 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించి ఈ లిస్టులో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత మహేష్ హీరోయిన్ కృతి సనన్ 39.7 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించింది అలాగే ఈ ఫాలోవర్స్ తో ఆమె తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక ఊర్వశి రౌటేలా 38 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి పదో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X