సుశాంత్ డెత్ సీన్ రీ క్రియేట్.. దేశంలోనే టాప్ ఫోరెన్సిక్ డాక్టర్‌తో సిద్దమైన సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు విషయంల్ రోజుకో వార్త హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా కేసు సీబీఐకి షిఫ్ట్ అవ్వడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. అధికారులు వేసే ప్రతి అడుగు కీలకంగా మారనుంది. అయితే కేసులో కీలక అంశాలను తెలుసుకోవడానికి సీబీఐ బృందం అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి ప్లాన్ రెడీ చేసుకుంది. దేశంలో టాప్ ఫోరెన్సిక్ డాక్టర్ ని ఏర్పాటు చేసుకున్నారు.

ఆ సంచలన తీర్పుకు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన సమాధానం దొరక్కపోవడంతో సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సంచలన తీర్పుకు దేశమంతా ఒక్కసారిగా మద్దతు పలికింది. సాధారణ జనాల నుంచి అగ్ర తారల వరకు కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కీలక ఆధారాలు సీబీఐ చేతికి
అయితే సీబీఐ అధికారులు కేసును ఎలా విచరిస్తారు అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సుశాంత్ నిజంగా హత్య చేయబడ్డాడా? లేక ఎవరి వాళ్ళైనా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు ఎన్నో ప్రపంచాన్ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. మొదట సుశాంత్ కేసును టేకాఫ్ చేసిన ముంబై పోలీసులు కీలక సమాచారాన్ని, ఆధారాలను సీబీఐ అధికారులకు అందిచనున్నారు.

ఇండియాలోనే టాప్ ఫోరెన్సిక్ వైద్యులను
అయితే సీబీఐ ఆ ఆధారాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఫ్రెష్ గా కేసును మొదటి పేజీ నుంచి ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. సుశాంత్ మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించచాడనికి ఇండియాలోనే టాప్ ఫోరెన్సిక్ వైద్యులను ని సీబీఐ అధికారులు నియమించుకున్నారు. నేర దృశ్యాన్ని మళ్ళీ రీ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మరింత లోతుగా విచారణ
అసలు సుశాంత్ మృతిపై పోలీసులు ఎంతవరకు సరైన పద్దతిలో ఇన్వెస్టిగేషన్ చేశారు అనే కోణంలో కూడా సీబీఐ అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక సుశాంత్ తో సంబంధం ఉన్న సన్నిహితులను మరోసారి విచారణ జరుపనున్నారు. ఇదివరకు ముంబై పోలీసులకు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకొని వారిని మరింత లోతుగా విచారణ జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











