మీటూ ట్విస్ట్: లైంగికంగా వేధించాడని ఆమె... అబద్దం అంటూ సాక్ష్యాలతో అతడు!
#మీటూ ఉద్యమం మొదలైన తర్వాత బాలీవుడ్ సింగర్ వర్షా సింగ్ ధనూవ ముందుకొచ్చి... మ్యూజిక్ కంపోజర్ తోషి శబ్రి వల్ల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తోషి శబ్రి ఆమెకు సంబంధించిన వాట్సాఫ్ చాట్, ఫోన్ రికార్డింగ్ సాక్ష్యాలు బయట పెట్టి ఆమె చెప్పేదంతా అబద్దమని చెప్పే ప్రయత్నంచేశారు.
తోషి శబ్రి బయట పెట్టిన వాట్సాప్ చాట్, ఫోన్ రికార్డింగ్స్ ఇపుడు బాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. #మీటూ ఉద్యమంలో చేరి తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపణలు చేస్తున్న వారి మాటలు నమ్మవచ్చా? అనే సందేహం కలిగించేలా చేశాయి.

వర్షా సింగ్ ధనూవా చేసిన ఆరోపణలు ఏమిటి?
మీటూ ఉద్యమంలో భాగంగా కొన్ని రోజుల క్రితం వర్షా సింగ్ ధనూవా... ప్రముఖ సింగర్ ఖైలాష్ ఖేర్, మ్యూజిక్ కంపోజర్ తోషి శబ్రి మీద ఆరోపణలు చేశారు. తనకు అవకాశం ఇచ్చే నెపంతో లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపణలు చేశారు.

తోషి శబ్రి అసభ్యంగా టచ్ చేశాడంటూ..
కారులో అతడితో కలిసి కూర్చున్నపుడు తనను అసభ్యంగా టచ్ చేసే ప్రయత్నం చేసేవాడని, రికార్డింగ్ స్టూడియోలో కూడా తనతో సెక్సువల్‌గా అభ్యంతరకరంగా మాట్లాడేవాడని... వర్షా కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన వీడియోలో ఆరోపించారు.

ఆ తర్వాత వారికి దూరంగా ఉన్నాను
తోషి శబ్రి మాటల్లో, చేష్టల్లో తప్పుడు ఉద్దేశ్యాలు అర్థమైన తర్వాత తాను వారికి దూరంగా ఉండటం మొదలు పెట్టాను. ఆ సంఘటన తర్వాత తాను తోషిని కానీ, ఇతర కంపోజర్లను కానీ కలవలేదని వర్షా సింగ్ ధనూవా తెలిపారు.

పూర్తిగా భిన్నమైన స్టోరీ చెప్పిన తోషి, సాక్ష్యాలతో..
అయితే వర్షా సింగ్ ధనూవ ఆరోపణలను ఖండించిన తోషి శబ్రి పూర్తిగా భిన్నమైన స్టోరీ చెప్పారు. తమ మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, వాయిస్ నోట్ సాక్ష్యాలతో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో వర్షా తన మ్యారేజ్ తర్వాత కూడా తోషి వెంటపడి వర్క్ కావాలని అడిగినట్లు ఉండటం గమనార్హం.
పెళ్లి తర్వాత కూడా నన్ను చేజ్ చేసింది
నేను వేధింపులకు పాల్పడ్డట్లు వర్షా సింగ్ ధనూవ ఆరోపిస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమెను నేను వేధించినట్లు చెబుతోంది. ఆ తర్వాత ఏ మ్యూజిక్ డైరెక్టర్‌ను కలవలేదు అంటోంది. కానీ ఆమె పెళ్లయిన తర్వాత కూడా నన్ను చేజ్ చేసింది. ఇందుకు సాక్ష్యం ఈ వాట్సాప్ సందేశాలే' అని తోషి శబ్రి బయట పెట్టారు.
నిజం ఏమిటో మీరే తేల్చుకోండి
తోషి శబ్రి విడుదల చేసిన వాట్సాప్ చాట్లో... వర్షా సింగ్ ధనూవా, తోషి శబ్రి మధ్య ఫ్రెండ్లీ చాట్ జరిగినట్లు స్పష్టం అవుతోంది. నేను ఆమెను వేధించి ఉంటే నన్ను ఎందుకు సంప్రదించింది? దీని బట్టి నిజం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి, నేను ఏ తప్పూ చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. మరి తోషి కౌటర్ మీద వర్షా సింగ్ ధనూవ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











