మరణించిన బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తు చేసుకొని.. స్టార్ హీరో కూతురు కన్నీరు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ విషాదం నుంచి ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించడంలేదు. గత నెల అంటే జూలై 2 తేదీన త్రిశాల బాయ్‌ఫ్రెండ్, ఇటలీకి చెందిన వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచి తన ప్రియుడి మరణంతో షాక్‌లో తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ లేఖ రాసింది. ఆమె రాసిన లేఖ ప్రతీ ఒక్కరికి ఉద్వేగానికి గురిచేసేలా ఉంది.
నీ మరణంతో నా హృదయం ముక్కలైంది. నన్ను సంరక్షించుకొన్న తీరు, నాకు కవచంలో నిలిచిన తీరు, ప్రేమించిన తీరుకు థ్యాంక్స్. నా జీవితంలో ప్రతీ క్షణం సంతోషంలో మునిగి తేలేటట్టు చేశావు. నీలాంటి వ్యక్తిని కలిసినందుకు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. విశాల ప్రపంచంలో నన్ను వదిలి వెళ్లావు అని త్రిశాల ఓ లేఖను పోస్టు చసింది.

నెలరోజులు గడిచిపోయినా తన బాయ్‌ఫ్రెండ్ మెమొరీస్‌లోనే గడుపుతున్నారు. అతని జాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ క్రమంలోనే ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ అంటూ కాప్షన్ పెట్టి ఓ పోస్టు చేశారు.
కొద్దిరోజుల క్రితం కూడా స్నేహితురాలి పెళ్లికి హాజరైన సమయంలో ఓ భావోద్వేగమైన లేఖను కూడా రాసింది. నన్ను చుట్టుముట్టిన బాధల నుంచి బయటపడేందుకే ఈ పెళ్లికి హాజరయ్యానని చెప్పింది. ఈ సందర్భంగా కూడా తను లేకపోవడం, ఆయనను కోల్పోవడం జీవితంలో తీరని లోటు అని పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











