అందమైన భార్యని పొందే అర్హత అభిషేక్‌కు ఉందా.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అభిషేక్!
ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై అభిషేక్ బచ్చన్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. అభిషేక్, స్టువర్ట్ బిన్నీ లాంటి వ్యక్తులకు అందమైన భార్యలని పొందే అర్హత లేదని ట్వీట్ చేశాడు. వారి తండ్రుల పలుకుపబడిని ఉపయోగించుకుని వీరిద్దరూ సినిమా, క్రికెట్ రంగాలలోకి వచ్చారని కామెంట్ చేశాడు. తాను చెప్పిన విషయంతో అంగీకరిస్తే రీట్వీట్ చేయమని నెటిజన్లని కోరాడు.
దీనిపై అభిషేక్ బచ్చన్ హుందాగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. బ్రదర్.. నాతో పాటు మైలు దూరం ప్రయాణించు, పది అడుగులు నడిచినా నేను ఇంప్రెస్ అవుతాను. మీ సమయాన్ని ఇలాంటి పనులకు వెచ్చించకుండా, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోండి. ఎవరి ప్రయాణం ఎటువంటిదో దేవుడికి తెలుసు అంటూ అభిషేక్ రిప్లై ఇచ్చాడు.

తన తప్పుని తెలుసుకున్న అతడు తిరిగి క్షమాపణ తెలియజేసాడు. నేను చేసిన ట్వీట్ సరదాకోసమే. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి అని తెలుసు. అమితాబ్ కుమారుడిగా మీపై, సచిన్ కుమారుడు అర్జున్ పై ఎంతటి ఒత్తిడి ఉంటుందో ఊహించుకోగలను. క్షమించండి అని బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications











