యాక్టింగ్ మానేసి వడాపావ్ అమ్ముకో.. నువ్వొక భయంకరమైన యాక్టర్!

Recommended Video

Netizen Says Abhishek Bachchan Should Open Vada Pav Stall

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళడు. అయినా కూడా ఈ చోటా బచ్చన్ కు సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పడం లేదు. ఈ విమర్శలని అభిషేక్ సహనంతో భరిస్తున్నాడు. విమర్శించే వారికి ఓపికగా సమాధానాలు ఇస్తున్నాడు. ఇటీవల అభిషేక్ బచ్చన్ మన్మార్జియా అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం గురించి అభిషేక్ ని ఓ నెటిజన్ విమర్శించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ ని విమర్శించిన వ్యక్తి ఓ వైద్యుడు కావడం విశేషం. అతడి విమర్శలకు అభిషేక్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చాడు.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

 బాక్సాఫీస్ వద్ద మన్మార్జియా

బాక్సాఫీస్ వద్ద మన్మార్జియా

అభిషేక్ బచ్చన్ నటించిన మన్మార్జియా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఆశించినంత జోరుగా ఈ చిత్ర వసూళ్లు కూడా లేవు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిషేక్ బచ్చన్ కు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.

 అభిషేక్‌ని అవమానిస్తూ

అభిషేక్‌ని అవమానిస్తూ

హర్షవర్ధన్ అనే వైద్యుడు అభిషేక్ బచ్చన్ ని అవమానిస్తూ ట్వీట్ చేశాడు. బావున్న సినిమాని కూడా ప్లాప్ చేసే టాలెంట్ అభిషేక్ వద్దే ఉంది. బంధుప్రీతికి ఇక ముగింపు పలకాలి. ఈ స్టార్ కిడ్ ఇక యాక్టింగ్ మానేసి వడపావ్ అమ్ముకుంటే మంచిది అంటూ దారుణంగా అవమానపరిచాడు.

రోగులతో కూడా

హర్షవర్ధన్ విమర్శలకు అభిషేక్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నారు. మీ పేషేంట్లతో కూడా ఇలాగే మాట్లాడుతారా. సినిమా గురించి మాట్లాడేముందు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడడండి అంటూ అభిషేక్ అతడికి సూచించాడు.

వరుసగా 16 ప్లాపులు

వరుసగా 16 ప్లాపులు

అభిషేక్ కౌంటర్ ఇచ్చిన తరువాత కూడా హర్షవర్ధన్ తన ట్వీట్ల పరంపర కొనసాగించాడు. ఈ ట్వీట్ చేస్తున్నందుకు నాకు సిగ్గుగా లేదు. వరుసగా 16 ప్లాపులు ఇచ్చిన మీరు సిగ్గుపడాలి అంటూ ఘాటు పెంచాడు.

వడాపావ్ అంటూ కించపరచకండి

వాడపావ్ పెట్టుకోవడానికి నేను సిగ్గు పడను. కానీ ఇలా వృత్తులని కించపరచకండి అంటూ అభిషేక్ సూచించాడు. మమల్ని విమర్శించడం మానేసి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంటూ అభిషేక్ అతడికి సూచించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X