మహేశ్ బాబు హీరోయిన్ పై దుమ్మేత్తిపోస్తున్న నెటిజన్లు.. ఎందుకు? ఏమైంది?

బాలీవుడ్ యంగ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు తెలుగు సినిమాల్లోనూ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఫలితంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మ ఎంతగానో దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ స్టార్స్ సరసన నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. అయితే ఈ క్రమంలో కృతి సనన్ తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కోవడం హాట్ టాపిక్ గ్గా మారింది.

తెలుగులో కృతి సనన్ నటించిన చిత్రాలు..
నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక్కడి ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది. తొలుత ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన '1 : నేనొక్కడినే' చిత్రంలో నటించింది. తన కెరీయర్ లోనే మొట్టమొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో అప్పట్లో భారీ స్థాయిలో ఆఫర్లు అందుకోలేకపోయింది. ఆ తర్వాత దోచేయ్ సినిమాలోనూ నాగచైతన్య సరసన మెరిసింది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ తెలుగు చిత్రాల్లో నటించ లేదు. కానీ పాన్ ఇండియా స్టార్, మన డార్లింగ్ ప్రభాస్ సరసన మాత్రం 'ఆదిపురుష్'లో నటించింది. ఇక గతేడాది వరుస పెట్టి సనిమాలతో వచ్చి థియేటర్లలో రచ్చ చేసింది.

Trolling Against Mahesh Babu Heroine Kriti Sanon

కృతి సనన్ కాంట్రవర్సీ ఏంటీ..
ప్రస్తుతం నార్త్ లో కృతి సనన్ కు స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉంది. తన 10 ఏళ్ల కెరీయర్ లో ఈ బ్యూటీ గుర్తుండి పోయే సినిమాల్లో నటించింది. హీరోపంథి, దిల్ వాలే, స్త్రీ, కలంక్, హౌజ్ ఫుల్ 4, బచ్చన్ పాండే, బేడియా, గణపథ్, క్రూ, దో పత్తి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోని బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది. ఈ సందర్భంగా ఎన్నో బ్రాండ్స్ కు ప్రచార కర్తగా నిలుస్తూ వస్తోంది. ఈ సందర్భంగా తాజాగా వొడ్కా మేజిక్ మూమెంట్స్ మత్తు పానీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ చేసుకుంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కృతి సనన్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయ్యి ఉండి, సమాజ హితమైన పనులు చేయాల్సింది పోయింది ఇలాంటి మత్తుపానీయాలకు సంబంధించిన బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఏమాత్రం సరికాదని, ప్రజలు, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన విషయాలను చెప్పాల్సిన మీరే ఇలాంటి లిక్కర్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం సబబు కాదని అంటున్నారు.

బెడిసి కొట్టిన టాలీవుడ్ ఎంట్రీ..
కృతి సనన్ ఎప్పుడో టాలీవుడ్ లో ఓ ఊపూపాల్సింది. మహేశ్ బాబు వంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ వచ్చినా టాలీవుడ్ లో నివలేకపోయింది. సరిగ్గా పదేళ్లకు మళ్లీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'ఆదిపురుష్' చేసినా టాలీవుడ్ లో సరైన పేరు దక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో.. థేరే ఇష్క్ మే అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X