దారుణంగా ప్రియాంక చోప్రాను ట్రోలింగ్.. చింపిరి జుట్టుతో ఆడుకున్నారు.. నవ్వులే నవ్వులు!
Recommended Video
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పరిచయం కావడానికి, వారి మధ్య ప్రేమ చిగురించడానికి బీజం పడింది న్యూయార్క్ వేదికగా 2017లో జరిగిన 'మెట్ గాలా' ఈవెంటులోనే... మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ జంట సోమవారం 'మెట్ గాలా 2019' ఈవెంటులో సందడి చేశారు.
ఈ వేడుకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిల్వర్ గౌనులో ప్రియాంక హాజరయ్యారు. డ్రెస్ ఓకే కానీ... ఆమె లుక్, ముఖ్యంగా హెయిర్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. కొందరికైతే వచ్చింది ఆవిడేనా? అని పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టింది. తాజాగా ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్ మీద ట్విట్టర్లో జరుగుతున్న ట్రోలింగ్ కడుపుబ్బా నవ్విస్తోంది.

ప్రియాంక చోప్రా వింత అవతారం
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ‘మెట్ గాలా' కార్యక్రమం నిర్వహిస్తున్నది. సెలబ్రిటీలంతా ఈ వేడుకలో వింత దుస్తులతో హాజరవుతుంటారు. ఇందులో భాగంగా ప్రియాంక చోప్రా వింత అవతారంలో దర్శనమిచ్చారు.

వీరప్పన్ మీసాలతో...
ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్ వీరప్పన్ మీసాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు సరదాగా క్రియేట్ చేసిన ఈ ఫోటోలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ట్విట్టర్లో మిలియన్ల కొద్దీ పాలోవర్లు ఉన్న ప్రియాంక చోప్రాపై ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

కరెంట్ షాక్ కొడితే అంతే...
కరెంట్ షాక్ కొట్టిన తర్వాత ప్రియాంక చోప్రా జుట్టు అలా తయారైంది అంటూ కొందరు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నాయి. ప్రియాంక అభిమానులు సైతం ట్రోలింగ్ విషయంలో సరదా కామెంట్ చేస్తుండటం గమనార్హం.

యోగి బాబు, ప్రియాంక చోప్రా
తమిళ కమెడియన్ యోగి బాబు హెయిర్ స్టైల్ స్పూర్తిగా తీసుకుని ప్రియాంక చోప్రాను ఇలా తయారు చేశారంటూ మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హెయిర్ స్టైల్ రావడానికి ఆమె స్టైలిస్టులు, మేకప్ మెన్స్ ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ... తమ కామెంట్లతో కొందరు నెటిజన్లు వారి కష్టాన్ని అవహేళన చేస్తున్నారు.
పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత
పెళ్లికి ముందు 2017లో తొలిసారి మెట్ గాలా వేడుకకు హాజరైన సందర్భంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లుక్.... పెళ్లయిన తర్వాత 2019లో మెట్ గాలా వేడుకకు హాజరైన సందర్భంగా వీరి స్టైల్ విషయంలో చాలా తేడా వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











