twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీర్ ది వెడ్డింగ్‌‌లో అలాంటి సీన్.. స్వర భాస్కర్ మాస్టర్బేషన్, చూడలేక పారిపోతున్న మహిళలు!

    |

    Recommended Video

    Veere Di Wedding Became Controversy

    కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్, శిఖ తలసానియా ఈ నలుగురు గ్లామర్ భామలు నటించిన వీర్ ది వెడ్డింగ్ చిత్రం మొదటినుంచి హాట్ టాపిక్ గా మారింది. వివాహ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విజయం దిశగానే సాగుతోంది. ఆరంభం నుంచి ఈ సినిమా విషయంలో ఎదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. నలుగురు భామలు అందాల ఆరబోతతో ఈ చిత్రంలో రెచ్చిపోయారు. పొట్టి డ్రెస్సులు ధరించిన విషయంలో ఇటీవల కరీనా కపూర్ ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని మరో హీరోయిన్ స్వరభాస్కర్ పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో స్వర భాస్కర్ సంచలన సన్నివేశంలో నటించింది.

    స్వర భాస్కర్‌పై ట్రోలింగ్

    స్వర భాస్కర్‌పై ట్రోలింగ్

    సోషల్ మీడియా వేదికగా స్వర భాస్కర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విమర్శలకు కారణం ఆమె వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో ఓ సంచలన సన్నివేశంలో నటించడం వలనే.

    టాక్ ఆఫ్ ది టౌన్

    టాక్ ఆఫ్ ది టౌన్

    వీర్ ది వెడ్డింగ్ చిత్ర ప్రచార కార్యక్రమాలు చూస్తేనే అర్థం అవుతుంది ఇది గ్లామర్ ప్రాధాన్యత ఉన్న చిత్రం అని. ఈ నలుగురు భామలు అందాల ఆరబోతలో రెచ్చిపోయి నటించారు. వివాహ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

     మాస్టర్బేషన్ సన్నివేశం

    మాస్టర్బేషన్ సన్నివేశం

    ఈ చిత్రంలో స్వర భాస్కర్ మాస్టర్బెషన్ సన్నివేశంలో నటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సన్నివేశంపై ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేసాం అని కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు.

    గ్రాండ్ మదర్‌తో సినిమాకు వెళ్ళా

    ఓ మహిళ ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ తాను తన గ్రాండ్ మదర్ తో వీర్ ది వెడ్డింగ్ చిత్రానికి వెళ్లానని, సినిమా మధ్యలోనే ఓ సన్నివేశం చూడలేక థియేటర్ నుంచి వచ్చేశామని ఆమె తెలిపింది. మనం భారతీయులం ఇలాంటి సన్నివేశాలు చూడలేం అని మా గ్రాండ్ మదర్ తెలిపినట్లు ఆమె ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది.

    ఘాటుగా రిప్లై ఇచ్చిన స్వర భాస్కర్

    కొందమంది డబ్బులు ఇచ్చిమరీ సోషల్ మీయదలో ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని స్వర భాస్కర్ మండిపడింది. వాళ్ళు సినిమా చూడడానికి, ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి ఖచ్చితంగా డబ్బులు తీసుకుని ఉంటారని అభిప్రాయపడింది. కొంతమంది నుంచి స్వర భాస్కర్ కు మద్దత్తు లభిస్తుంది కూడా.

    English summary
    Trolls slam Swara Bhasker's masturbation scene. Veere Di Wedding became controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X