రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో రూ.30 కోట్లు.. ఇంతకీ ఈ క్రేజీ మూవీ ఏంటీ?
Tumbbad Re-Release: ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది అదే రీ రిలీజ్(re-release). పెద్ద హీరోలు తమ కొత్త సినిమాలు లేట్ కావడంతో తమ అభిమానులను పలుకరించడానికి రీ రిలీజ్ పేరిట తమ బ్లాక్ బస్టర్ మూవీలను రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు ఎంటర్ టైన్ చేస్తునే బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో తమ అభిమాన హీరోల రీ రిలీజ్ మూవీస్ ను కూడా ప్రస్టేజీయస్ గా తీసుకుంటున్నారు. దీంతో రీ రిలీజ్ సినిమాల కలెక్షన్లలోనూ పోటీ పడుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి తరుణంలో ఓ చిన్న సినిమా రీ రిలీజ్ కావడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో కలెక్షన్లు కొల్లగొడుతుంది. రిలీజ్ టైం లో కంటే.. రీ రిలీజ్ లో డబుల్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ రికార్డు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? దాని కథంటే? ఓ లూక్కేద్దామా..
ఆ మూవీ ఏదో కాదు.. ఆరేళ్ల క్రితం అంటే 2018 లో హిందీలో విడుదలైన "తుంబాడ్"("Thumbad"). ఆ సమయంలో ఈ మూవీ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అప్రిషేట్ చేశారు. కానీ, ఆనాటి పోటీ ప్రపంచంలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అయినా రూ. 12.30 కోట్లు వసూలు చేసి.. చరిత్ర సృష్టించింది. ఈ సినిమాను OTTలో విడుదలైన తర్వాత.. చాలా మంది ప్రేక్షకులు దీనిని వీక్షించారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై భారీ ఎత్తున చర్చ జరిగింది. 'థియేటర్లలో చూడాల్సిన సినిమా' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ఈ మూవీ లవర్స్ కోరిక మేరకు 13 సెప్టెంబర్ 2024న రీ-రిలీజ్ చేశారు.

రీరిలీజ్ లో మాత్రం అన్ని ఇండస్ట్రీల్లోను దుమ్ముదులిపేసింది. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్‌లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ లో డబుల్ కలక్షన్లు కొట్టిన సినిమా ఇదే. మూడు వారాల క్రితం థియేటర్లలో విడుదలైన 'తుంబాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనిస్తుంది. ఇప్పటి వరకూ ఇండియా వైడ్ గా మొత్తం రూ.30.4 కోట్లు వసూలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే వరుస సెలవులు, దసరా హాలీడేస్ ఉండటం, అలాగే.. భారీ బడ్జెట్ సినిమాలు లేకపోవడంతో ఈ రీ రిలీజ్ మూవీకి కలెక్షన్లు పెరుగుతున్నాయి.
ఇదే పరిస్థితి ఉంటే.. మరో పది రోజుల్లో ఈ మూవీ ఏకంగా రూ. 50 కోట్లు కొల్లగొడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మూవీ రీ రిలీజ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొట్లాకొడటంతో 'తుంబద్ 2' కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2018లో విడుదలైన 'తుంబాద్' మూవీ ఓ జానపద కథ ఆధారంగా రూపొందిన హారర్ చిత్రం. ఈ చిత్రానికి రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించగా, ఆదేశ్ ప్రసాద్ సహ దర్శకత్వం వహించారు. సోహమ్ షా, ఆనంద్ ఎల్. సోహమ్ షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని రాయ్, ముఖేష్ షా, అమిత్ షా నిర్మాతలుగా వ్యవహరించారు. రాహి అనిల్ బార్వే ప్రస్తుతం తన కొత్త ప్రొడక్షన్స్ 'పహద్‌పంగిర, పక్షితీర్ అనే చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొట్లాకొడటంతో 'తుంబద్ 2' కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తుంబాద్ కు అవార్డుల పంట...
'తుంబద్' కలెక్షన్ల పరంగా కాకుండా.. ఎన్నో అవార్డును సొంతం చేసుకుంది. 64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఈ మూవీ ఏకంగా ఎనిమిది నామినేషన్లలో నిలువుగా ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సౌండ్ ప్రొడక్షన్‌తో సహా మరో మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో కథాంశం, నిర్మాణ విలువలు, అద్భుతమైన సినిమాటోగ్రఫీకి ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ హర్రర్ మూవీ. అలాగే 75వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'క్రిటిక్స్ వీక్' విభాగంలో ప్రదర్శించబడిన మొదటి భారతీయ చిత్రంగా కూడా తుంబాద్ మూవీ నిలిచింది.


Click it and Unblock the Notifications











