Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టెలివిజన్ నటి ఆత్మహత్య.. మరణానికి ముందే ప్రెగ్నెంట్?.. డ్రగ్స్ కోణం.. పోస్టుమార్టంలో సంచలన విషయాలు
టెలివిజన్ నటి తునీషా శర్మ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ షోతో పాపులారిటీ సంపాదించుకొన్న ఈ యువ నటి ఇటీవల మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో జరుగుతున్నే షూటింగ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. షూటింగ్ టీ బ్రేక్‌లో తన సహ నటుడి బాత్రూంలో మరణించడం అనేక అనుమానాలకు దారి తీసింది. అయితే తాజాగా పోలీసులు వెల్లడించిన పోస్టు మార్టం రిపోర్టులో వెలుగు చూసిన అంశాలు ఏమిటంటే?

పెళ్లి ప్రస్తావన కారణంగానే..
నటి తునీషా శర్మ తన తోటి నటుడు షీజాన్ ఖాన్‌తో కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నది. వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండగా.. పెళ్లి ప్రస్తావన రావడం, అది వారి మధ్య అభిప్రాయ బేధాలు కారణమైంది. దాంతో వారిద్దరి మధ్య 15 రోజుల క్రితం బ్రేకప్ చోటుచేసుకొన్నది. దాంతో వారిద్దరూ విడివిడిగా ఉంటు వస్తున్నారు. అలాగే కలిసి షూటింగులో పాల్గొంటున్నారనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సూసైడ్ ఊహించలేదు అంటూ
మహారాష్ట్రలోని వాసైలో టెలివిజన్ షో షూటింగు జరుగుతుండగా తునీషా శర్మ తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం సినీ, టెలివిజన్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆమె షూటింగు స్పాట్‌లో ముభావంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకొంటారని ఊహించలేదు అని సన్నిహితులు, స్నేహితుల, తోటి నటీనటులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

గర్బవతి, డ్రగ్స్ ఆరోపణలు వైరల్
తునీషా శర్మ మరణానికి ముందే గర్బవతి. డ్రగ్స్ ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకొన్నారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తునీషా ప్రెగ్నెంట్ కాదు. ఆమె మానసిక క్షోభతోనే ఆత్మహత్య చేసుకొన్నారు. తన మాజీ ప్రియుడితో బ్రేకప్ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ కారణాల వల్లే ఆమె సూసైడ్ చేసుకొందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే షీజాన్ ఖాన్ అవమానపరచడం వల్లే నా కూతురు మరణించిందని పోలీసులు పేర్కొన్నారు.

తునీషా ఎలా మరణించిందంటే?
తునీషా శర్మ మరణం తర్వాత ఆమె మృతదేహాన్ని ముంబైలోని జేజే హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టు మార్టం రిపోర్టులో వెల్లడించిన ప్రకారం.. ఊపిరి ఆడకపోవడం వల్లే ఆమె మరణించింది. మరణించే సమయానికి ఆమె ప్రెగ్నెంట్ కాదు. ఆమె ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని పోస్టు మార్టం నివేదిక వెల్లడించింది. అయితే సూసైడ్ నోట్ లభించకపోవడంతో తునీషా మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరో నటుడిని విచారించిన పోలీసులు
తునీషా శర్మ మరణం తర్వాత తల్లి ఫిర్యాదు మేరకు షీజాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నటుడు పార్థ్ జుస్తీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. తునీషా మరణం కేసులో పోలీసులు విచారించారు. జనరల్‌గా కొన్ని ప్రశ్నలు అడిగారు. తునీషా రిలేషన్‌షిప్ గురించి నో కామెంట్. వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు. ఆ బ్రేకప్ వ్యవహారం వారిద్దరి వ్యక్తిగతం అని పార్థ్ జుస్తీ అన్నారు.