twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోర్న్ సైట్లపై నిషేదం వద్దు, అలా చేస్తే మగాళ్లలో కామాగ్ని చల్లారదు: నటి సంచలనం

    |

    ఇండియాలో పోర్న్ సైట్లను బ్యాన్ చేయడం సరికాదు అంటోంది టీవీ నటి మహికా శర్మ. ఇలా చేయడం వల్ల దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు లాంటి సంఘటనలు మరింత పెరుగుతాయని ఆమె అభిప్రాయ పడ్డారు.

    పోర్న్ బ్యాన్ చేయడం వల్ల రూరల్ ఏరియాల్లో అమ్మాయిలను అసభ్యంగా వీడియోలు చిత్రీకరించడం, ఎంఎంఎస్ లాంటివి క్రియేట్ చేసి వైరల్ చేయడం లాంటి కల్చర్ పెరుగుతుందని, ఇది అంత మంచి పరిణామం కాదు అని ఆమె వ్యాఖ్యానించారు.

    సమస్యకు ఇది పరిష్కారం కాదు

    సమస్యకు ఇది పరిష్కారం కాదు

    పోర్న్ సినిమాలను నిషేధించడం నాకు నచ్చలేదు. సమస్యకు ఇది పరిష్కారం కాదు. దీని వల్ల ఇండియాలో రేప్ సంఘటనలు తగ్గుతాయా? ఇలా చేయడం వల్ల రేప్ సంఘటనలు మరింత పెరుగుతాయి, ఆకతాయిలు ఇక నుంచి అమాయకులైన అమ్మాయిలపై అసభ్యంగా వీడియోలు చిత్రీకరించి వాటిని వైరల్ చేసే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.

    వారి తల్లిదండ్రులే వారిని ఇంట్లో వేసి తాళం

    వారి తల్లిదండ్రులే వారిని ఇంట్లో వేసి తాళం

    అలాంటివి జరిగినపుడు ఇండియన్ సొసైటీలో వాటిని దాచే ప్రయత్నం చేస్తారు. బాధితులను బయటకు వచ్చి మాట్లాడేందుకు కూడా అనుమతించరు, వారి తల్లిదండ్రులే వారిని ఇంట్లో వేసి తాళం వేస్తారు. ఇలాంటివి ఎక్కువగా రూరల్ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది. కొందరు వారి కామ కోరికలను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అని మహికా శర్మ వ్యాఖ్యానించారు.

    సెక్స్ గురించి ఓపెన్‌గా

    సెక్స్ గురించి ఓపెన్‌గా

    పోర్న్ వెబ్ సైట్లను నిషేధించే బదులు... ప్రభుత్వం ముందుకు వచ్చి సెక్స్ అనే అంశాన్ని అందరూ ఓపెన్‌గా మాట్లాడుకునేలా జనాల్లో అవగాహన కల్పించాలి అని వ్యాఖ్యానించారు. ఇతర అంశాల్లాగే దీన్ని నేచురల్‌గా ట్రీట్ చేసే పరిస్థితులు రావాలన్నారు.

    పోర్న్ ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నాడు

    పోర్న్ ఇండస్ట్రీలో చాలా కష్టపడుతున్నాడు

    ‘ది మోడర్న్ కల్చర్' సినిమాలో తనతో పాటు నటిస్తున్న నా కోస్టార్, ఫ్రెండ్ డానీ డి (బ్రిటిష్ పోర్న్ స్టార్) పోర్న్ ఇండస్ట్రీలో చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎక్కువ రోజులు పని చేస్తుంటాడు. హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లకంటే హార్డ్ వర్క్ చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.

    అభిమానుల పరిస్థితి ఏమిటి?

    అభిమానుల పరిస్థితి ఏమిటి?

    ఇపుడు ఇండియాలో పోర్న్ బ్యాన్ చేయడం వల్ల అతడు నటించిన సినిమాలు ఇక్కడి అభిమానులు చూడలేరు. ఇది నన్ను ఎంతో అసంతృప్తికి గురి చేస్తోంది. ఇండియన్ గవర్నమెంటును పోర్న్ సైట్లపై విధించిన నిషేధం ఎత్తివేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మహికా శర్మ తెలిపారు.

    సెక్స్ చెడ్డది కాదు

    సెక్స్ చెడ్డది కాదు

    సెక్స్ అనేది చెడ్డది కాదు. ఇలాంటి వాటిపై నిషేదం విధించడం వల్ల మనం ఫ్రీడం కోల్పోతున్నాం. రేప్ కల్చర్ తగ్గించడానికి ప్రభుత్వం మరో విధంగా ప్రయత్నం చేయాలి. పోర్న్ సినిమాలపై బ్యాన్ విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు.

    కామాగ్ని చల్లారేది ఎలా?

    కామాగ్ని చల్లారేది ఎలా?

    మీటూ ఉద్యమం వల్ల ఇండియన్ మెన్స్‌లో కామాగ్ని మరింత పెరిగింది, పోర్న్ సైట్లను బ్యాన్ చేస్తే అది మరింత ఎక్కువ అవుతుంది. సుప్రీం కోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద నాకు గౌరవం ఉంది. కానీ నా ఫ్రెండ్ డానీ డి పోర్న్ చిత్రాలు చూడటం నాకు ఇష్టం అని మహికా శర్మ చెప్పుకొచ్చారు.

    English summary
    TV actress Mahika Sharma expressed her views on the decision to ban porn in India. She is against the step and feels that this decision will further increase cases of rapes and molestation in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X