అందుకు ఒప్పుకోలేదని దారుణం.. టీవీ నటిపై కత్తితో దాడి

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మామూలుగా అయితే ఈ సూత్రం కేవలం సెలెబ్రిటీలకే కాదు సామాన్య జనానికి కూడా వర్తిస్తుంది. సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే పనికి వస్తోంది. ఒక్కోసారి ఈ సోషల్ మీడియా వల్ల జరిగే అనార్థాలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఫేస్ బుక్ పరిచయాలు, ప్రేమగా మారి చివరకు విషాదాన్ని నింపిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఓ ఘటనే సినీ నటికి ఎదురైంది.

 బుల్లితెర ఆర్టిస్ట్..

బుల్లితెర ఆర్టిస్ట్..

హిందీ సీరియల్స్‌తో ఫేమస్ అయింది మాల్వీ మల్హోత్ర. ఉడాన్ అనే సీరియల్‌తో ఫేమస్ అయిన మాల్వీ.. ఆపై హోటల్ మిలాన్ అనే చిత్రంలోనూ నటించింది. తాజాగా మాల్వీ వార్తల్లో నిలిచింది. ఆమెపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో ఆస్పత్రి పాలైంది. అసలేం జరిగిందో ఓసారి చూద్దాం.

ఫేస్‌బుక్ పరిచయం..

ఫేస్‌బుక్ పరిచయం..

కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి ద్వారా మాల్వీని పొడిచినట్టు తెలుస్తోంది. ఆడీ కార్‌లో వచ్చిన మహిపాల్ సింగ్ ఆమెను పొడిచినట్టు అక్కడి వారు చెబుతున్నారు. అయితే అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. మాల్వీకి నిర్మాతగా తనను తాను పరిచయం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2019లో ఈ ఇద్దరికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైనట్టు సమాచారం.

ఒప్పుకోలేదు..

ఒప్పుకోలేదు..

ఈ ఇద్దరూ బయట కొన్ని సార్లు కలిసినట్టు తెలుస్తోంది. తనపై దాడి చేసినందుకు మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్‌లో ఆమె చేసిన ఆరోపణలు ఈ విధంగాఉన్నాయి. అతను పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేశాను. దానికి నేను అంగీకరించలేదు. ఆ తరువాత అతనితో మాట్లాడటం కూడా మానేశాను అందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పుకొచ్చింది.

Recommended Video

Prema Pipasi Movie New Trailer
 కత్తితో పొడిచాడు..

కత్తితో పొడిచాడు..

అక్టోబర్ 25న దుబాయ్ నుంచి వచ్చాను. సోమవారం రాత్రి కాఫీ షాపు నుంచి బయటకు వస్తుండగా.. ఆడి కారులోంచి మహిపాల్ దిగాను. నన్ను అడ్డగించాడు. నాతో మాట్లాడాలి అంటూ వెంటపడ్డాడు కానీ నేను ఒప్పుకోలేదు. ఇయ చివరకు కత్తి తీశాడు. నా కడుపులో పొడిచేశాడు. అంతేకాకుండా నా కుడి మణికట్టు, ఎడమ చేతి వేళ్లకు కూడా గాయం తగిలింది అంటూ ఫిర్యాదు ఇచ్చింది. ప్రస్తుతం మాల్వీ కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X