బాలీవుడ్ సింగర్ దుర్మరణం.. చిన్న గాయాలే అనుకున్న డాక్టర్లు.. రక్తం కక్కుకుని!

90 దశకంలో పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ నితిన్ బాలి(47) మంగళవారం దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. నితిన్ బాలి సతీమణి రోమా బాలి టివి నటిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ బాలి గాత్రం నుంచి పలు సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆయన పాటలు 90 వ దశకంలో శ్రోతల్ని ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉండగా నితిన్ బాలి మరణం ఊహించని పరిస్థితులలో చోటు చేసుకుంది. కనీసం వైద్యులు కూడా ఆయన మరణాన్ని ఊహించలేకపోయారు.

 నివాసానికి బయలు దేరి

నివాసానికి బయలు దేరి

నితిన్ బాలి ముంబైలోని మలాద్ ప్రాంతంలో పని పూర్తి చేసుకుని కారులో తన నివానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో కారు డివైడర్ ని బలంగా ఢీ కొట్టడంతో నితిన్ బాలికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడికి గాయాలు డాక్టర్లకు ప్రమాదకరంగా కనిపించలేదేమో.

చిన్న గాయాలే అనుకుని

చిన్న గాయాలే అనుకుని

నితిన్ బాలి ముఖానికి, ఇతర భాగాల్లో గాయాలకు చికిత్స చేసి.. ఇక ఏం పరవాలేదని డిశ్చార్జ్ చేశారు. కానీ ఆ తరువాత ఘోరం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. గాయాలకు కట్లు కట్టి ఇంటికి పంపారు.

రక్తం కక్కుకుని

రక్తం కక్కుకుని

నితిన్ బాలి ఇంటికి చేరగానే అతడికి రక్తంతో వాంతులు ప్రారంభమయ్యాయి. రక్త పోటు దారుణంగా పడిపోయింది. హార్ట్ బీట్ కూడా సహజంగా లేదు. దీనితో నితిన్ బాలి ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. నితిన్ బాలి మరణించారు.

సంగీతానికి దూరంగా

సంగీతానికి దూరంగా

నితిన్ బాలి 2012 నుంచి సంగీతానికి దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి రోమా బాలి పలు హిందీ సీరియల్స్ లో నటిస్తోంది. నితిన్ బాలి అద్భుతమైన సింగర్ అయినప్పటికీ ఎలాంటి సందర్భంలో కూడా వార్తల్లో నిలవలేదు. అతడి వ్యక్తిగత విషయాలన్నీ రహస్యంగానే ఉంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X