పెళ్లికాకుండానే తల్లైన ఏక్తాకపూర్.. మగబిడ్డకు జననం..
ప్రముఖ సినీ, టెలివిజన్ నిర్మాత ఏక్తాకపూర్ పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లి అయ్యారు. సరోగసి ద్వారా మగబిడ్డకు తల్లి అయ్యారు. జనవరి 27న మగశిశువు జన్మించారు. త్వరలోనే బిడ్డను ఇంటికి తీసుకురానున్నారు అని బాలీవుడ్ పత్రికలు వెల్లడించాయి. ప్రముఖ నటుడు జితేంద్రకు ఏక్తా కపూర్ కుమార్తె అనే విషయం తెలిసిందే. సరోగసి ద్వారా జితేంద్ర కుటుంబం ఓ బిడ్డకు జన్మను ప్రసాదించడం ఇదే మొదటిసారి కాదు. వివరాల్లోకి వెళితే..

సరోగసి ద్వారా బిడ్డను
గతంలో ఏక్తా కపూర్ సోదరుడు, నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి ( వేరే తల్లి గర్భంలో కృత్రిమ గర్భధారణ ద్వారా) ఓ బిడ్డకు తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డకు లక్ష్య అనే పేరు పెట్టారు. లక్ష్య అంటే ఏక్తా కపూర్‌కు చెప్పలేనంత ప్రేమ. పలుమార్లు లక్ష్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బ్రహ్మాచారిగా ఏక్తా కపూర్
ఇక ఏక్తా కపూర్ విషయానికి వస్తే ఆమె 43 ఏళ్ల బ్రహ్మాచారి. గతంలో కరణ్ జోహర్, తదితర బాలీవుడ్ ప్రముఖులతో అఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అవి ఏవీ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. అయితే సోదరుడు తుషార్ స్ఫూర్తితో సరోగసి ద్వారా బిడ్డను పొందాలని నిర్ణయం తీసుకొన్నారు.

టెలివిజన్ రంగంలో ఏక్తా
ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఏక్తా కపూర్ తిరుగులేని నిర్మాత. హిందీలో ఆమె నిర్మించిన కుమ్ కుమ్ భాగ్య, కుండలి భాగ్య, యే మోహబ్బతేన్, కసమ్, తెరే ప్యార్ కి, క్యూంకీ సాస్ బీ కబీ బహు థి, బడే అచ్చే లగ్తీ హై సీరియల్స్ ప్రేక్షకులకు అందించారు.

సినీరంగంలో ఏక్తా డర్టీ పిక్చర్
హిందీ సినీ పరిశ్రమలో కూడా పలు ప్రజాదరణ చిత్రాలను ఏక్తా కపూర్ నిర్మించారు. రాగిణి ఎమ్మెమ్మెస్, ది డర్టీ పిక్చర్, షూట్ అవుట్ ఎట్ వడాలా, వీర్ దే వెడ్డింగ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











