ఆయనకు 11 మంది, నాకు ఒక్కరూ లేరు: అక్షయ్ కుమార్ గాలి తీసిన భార్య!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఇంట్లో ఎంత సరదాగా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. తాజాగా ఓ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఓ సందర్భంలో అక్షయ్ కుమార్ గాలి మొత్తం తీసేసే ప్రయత్నం చేసింది ట్వింకిల్.

ఈ అవార్డ్స్ కార్యక్రమంలో ట్వింకిల్ కన్నా మోస్ట్ స్టైలిష్ ఆథర్ అవార్డ్ అందుకున్నారు. మీ భార్య అవార్డు అందుకోవడంపై స్పందించాలని మీడియా ప్రతినిధి కోరగా... 'ఆమె అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది చాలా ముఖ్యమైన, స్టైలిష్ అవార్డ్' అని అక్షయ్ చెబుతుండగా వెంటనే ట్వింకిల్ అడ్డుపడి 'ఎందుకు మీరు ప్రధాన మంత్రి లాగా ప్రసంగాలు దంచుతున్నారు' అంటూ శ్రీవారి గాలి తీసేసే ప్రయత్నం చేసింది.

ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్న అక్షయ్, ట్వింకిల్

ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్న అక్షయ్, ట్వింకిల్

మీ స్టైల్ విషయంలో ట్వింకిల్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? అని అడగ్గా... అక్షయ్ కుమార్ 100% అంటూ సమాధానం ఇచ్చారు. ట్వింకిల్ వెంటనే రియాక్ట్ అవుతూ.. అలాంటిదేమీ లేదు. ఆయనకు నాకంటే ఎక్కవ షూస్ ఉన్నాయి. అంతే కాదు పింక్, గ్రీన్, లైలాక్, డార్క్ పర్పల్, ఎల్లో కలర్ ప్యాంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ‘అవి నేనే కొన్నాను అని మాత్రం చెప్పకు' అంటూ అక్షయ్ వెంటనే పంచ్ వేశాడు. ‘నీ రెయిన్ బో కలర్స్ ప్యాంట్స్ నేను కొన్నాను అని అస్సలు చెప్పను' అంటూ మళ్లీ ట్వింకిల్ రివర్స్ పంచ్ వేసింది.

ఇవి మన గొప్పలు చెప్పుకునే అవార్డ్స్ కాదమ్మా

ఇవి మన గొప్పలు చెప్పుకునే అవార్డ్స్ కాదమ్మా

ఒక సారి నేను అక్షయ్ టీం మెంబర్ ఒకరిని మీ హీరోకు ఎన్ని షూలు ఉన్నాయని అడిగితే.... 350 జతలకు పైనే ఉన్నాయని తెలిసింది అంటూ ట్వింకిల్ చెప్పగా... వెంటనే అక్షయ్ కుమార్ రియాక్ట్ అవుతూ ‘ట్వింకిల్ బేబీ ఇది మన గొప్పలు చెప్పుకునే అవార్డులు కాదు' అంటూ సెటైర్ వేశారు.

ఆయనకు 11 మంది సహాయకులు, నాకు ఒక్కరు కూడా లేరు

ఆయనకు 11 మంది సహాయకులు, నాకు ఒక్కరు కూడా లేరు

మీ ఇద్దరిలో ఎవరు రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు? అనే ప్రశ్నకు... ట్వింకిల్ రియాక్ట్ అవుతూ ‘నేను త్వరగానే అవుతా. కానీ ఆయనకు దుస్తుల కోసమే సపరేటుగా ఒక రూమ్ ఉంది. 11 మంది సహాయకులు ఉన్నారు. నాకు ఒక్కరు కూడా లేరు. అందుకే నాకు కొన్ని సార్లు రెడీ కావడానికి సమయం పడుతుంది' అని ట్వింకిల్ చెప్పుకొచ్చారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్ వివాహం జరిగిన 18 సంవత్సరాలు అవుతోంది. ఎలాంటి కలతలు లేకుండా వీరు అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. వీరికి అరవ్ అనే కుమారుడు, నితారా అనే అనే కూతురు ఉంది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన మిషన్ మంగళ్, గుడ్ న్యూస్, హౌస్‌ఫుల్ 4 చిత్రాల్లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హౌస్‌ఫుల్ 4 మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X