twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇద్దరు హీరోయిన్లపై బ్యాన్ విధించిన స్టార్ హీరో భార్య... కారణం ఏమిటి?

    |

    టాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ తరహాలో ట్విట్టర్లో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ సంచలనం క్రియేట్ చేసే బాలీవుడ్ నటుడు, క్రిటిక్, నిర్మాత కమల్ రషీద్ ఖాన్(కెఆర్‌కె).. తాజాగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాను టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు.

    కత్రినా కైఫ్ బాలీవుడ్లో సక్సెస్‌ఫుల్ నటిగా ఎదిగిందంటే... ఆ క్రెడిట్ అక్షయ్ కుమార్‌కు మాత్రమే దక్కుతుందని, ఆమె ఈ స్థాయికి రావడానికి కారణం సల్మాన్ ఖాన్ ఏ మాత్రం కాదని తెలిపారు. అంతే కాదు... తన భర్త కత్రినాతో నటించవద్దంటూ ఆమెపై బ్యాన్ కూడా విధించిందట అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.

    కత్రినాపై తన భార్య బ్యాన్ విధించినా..

    కత్రినాపై తన భార్య బ్యాన్ విధించినా..

    ‘‘మీడియా వారంతా కత్రినా కైఫ్ ఈ స్థాయికి రావడానికి సల్మాన్ ఖాన్ అని రాస్తున్నారు. ఇది 100 శాతం అన్ ఫెయిర్. గ్రేట్ డైరెక్టర్ రాజ్ కన్వర్-అక్షయ్ కుమార్ తమ ‘హమ్‌కో దీవానా కర్ గయే' చిత్రం ద్వారా కత్రినాను రీ లాంచ్ చేశారు. తన భార్య ట్వింకిల్ ఖన్నా.. కత్రినాపై బ్యాన్ విధించినా... అక్షయ్ కుమార్ ఆమెకు తన సినిమాల్లో వరుస అవకాశాలు ఇచ్చారు''అని కమల్ రషీద్ ఖాన్ ట్వీట్ చేశారు.

    తన తండ్రి లాంటి వాడని చెప్పినా... ట్వింకిల్‌లో అనుమానం తగ్గలేదు

    తన తండ్రి లాంటి వాడని చెప్పినా... ట్వింకిల్‌లో అనుమానం తగ్గలేదు

    కెఆర్‌కె మరో ట్వీట్లో... ‘అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న సూర్యవంశీతో కలిపి కత్రినాతో 8 సినిమాలు చేశారు. అందుకే ఆమె రియల్ గాడ్ ఫాదర్ అక్షయ్ కుమార్. సల్మాన్ ఖాన్ షో ‘దస్ కా దమ్' షోలో అక్షయ్ తన ఫాదర్ లాంటి వారని కత్రినా చెప్పినప్పటికీ.... ఆమెపై ట్వింకిల్ ఖన్నా బ్యాన్ కొనసాగుతోంది. కత్రినాతో పాటు ప్రియాంక చోప్రా, మరికొందరు నటీమణులు అక్షయ్ కుమార్‌తో నటించకుండా ట్వింకిల్ బ్యాన్ విధించిందని కమల్ రషీద్ ఖాన్ చెప్పుకొచ్చారు.

    సల్మాన్ ఖాన్ హీరోయిన్లంతా ప్లాప్ అయ్యారు

    సల్మాన్ ఖాన్ హీరోయిన్లంతా ప్లాప్ అయ్యారు

    సల్మాన్ ఖాన్ లాంచ్ చేసిన స్నేహా ఉల్లాల్, జరీన్ ఖాన్, సోనాక్షి, డైసీ, ప్రనూతన్ అందరూ ఇండస్ట్రీలో ప్లాప్ అయ్యారు, కానీ కత్రినా కైఫ్ అతడి వల్ల ఇండస్ట్రీకి పరిచయం కాలేదు కాబట్టే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది... అని కెఆర్‌కె వ్యాఖ్యానించారు.

    భార్య షరతు పట్టించుకోని అక్షయ్ కుమార్

    భార్య షరతు పట్టించుకోని అక్షయ్ కుమార్

    అయితే ట్వింకిల్ ఖన్నా కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లపై ఎందుకు బ్యాన్ విధించింది? అనే విషయంలో మాత్రం కెఆర్‌కె క్లారిటీ ఇవ్వలేదు. అక్షయ్ కుమార్ వారికి వరుస అవకాశాలు ఇస్తుండటంతో ఆమెలో అనుమానం మొదలైందని, అందుకే వారితో నటించ వద్దని భర్తకు షరతులు పెట్టిందని టాక్. అయితే అక్షయ్ కుమార్ తన భార్య మాటలను లెక్కలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది.

    English summary
    Kamaal R Khan is known for spitting fire on his Twitter page and his recent targets are Salman Khan, Katrina Kaif, Akshay Kumar and Twinkle Khanna. In a series of tweets, KRK went on to claim that if today, Katrina is a successful actress, the credit goes to Akshay Kumar, not Salman Khan. KRK went on to add that Salman Khan didn't shape up the career of Katrina but Akshay. But later, Twinkle banned Akshay from working with Katrina. Shocking, right? Here's what he tweeted..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X