Divorce: ఐశ్వర్యరాయ్ విడాకుల వ్యవహారంలో ట్విస్ట్.. అభిషేక్ అలాంటి నిర్ణయం!
బాలీవుడ్‌లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారం అత్యంత చర్చనీయాంశమవుతున్నది. అయితే రకరకాల ఊహాగానాలు మీడియాలో వస్తున్నప్పటికీ.. బచ్చన్ ఫ్యామిలీ గానీ, ఐశ్వర్య సన్నిహితులు గానీ ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ఈ వ్యవహారం మరింత వివాదంగా మారింది. అయితే తాజాగా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ రిలేషన్‌షిప్, బ్రేకప్ వార్తలకు సంబంధించిన విషయంలో ఓ ట్విస్టు బయటకు వచ్చింది. ఆ కీలక అంశం వివరాల్లోకి వెళితే..
అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ దాంపత్య జీవితం గురించి ఎప్పటి నుంచో పలు విషయాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని, వారిద్దరి విడిపోవడం ఖాయమనే ఊహగానాలు మీడియాలో వచ్చాయి. అయితే అయితే వారి గురించిన వార్తలు టెలివిజన్ సీరియల్‌లా కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లి సమయంలో జరిగిన సంఘటనలు బిగ్ బీ ఫ్యామిలీ విషయాలు బయటకు వచ్చాయి. అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన భర్తతో కలిసి రాకపోవడం, అలాగే అభిషేక్ కూడా తన ఫ్యామిలీతోనే ఉండటం వల్ల దాదాపు విడిపోయారనే వార్తలకు బలం చేకూరింది.
అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారంపై పరోక్షంగా స్పందించారు. అయితే తాము విడిపోయినట్టు వస్తున్న వార్తలపై కూడా ఖండించలేదు. అటు సమర్ధించలేదు. కానీ నేను ఇంకా వివాహితుడినే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే వివాహితుడినే అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం ఏంటనిదీ ప్రశ్నగానే మారింది.

ఇదిలా ఉండగా, ఐశ్వర్యకు ఓ డాక్టర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకు పొక్కింది. అయితే వారి మధ్య ఉన్న కేవలం స్నేహం మాత్రమే లేదు. మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవాలు అంటూ కొందరు సన్నిహితులు క్లారిటీ ఇ్చే ప్రయత్నం చేశారు.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. ఐశ్వర్య, అభిషేక్ మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించేందుకు.. వారిని మళ్లీ కలిపేందుకు స్నేహితులు, సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలకు ఇద్దరు కూడా సానుకూలంగానే ఉన్నారు. అయితే విడాకుల వరకు వెళ్లకుండా సినీ, ప్యామిలీ వర్గాలు చొరవ తీసుకొంటున్నారు అనేది తాజా సమాచారం. అయితే అభిషేక్ కూడా ీ విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











