twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్యన్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. బలవంతంగా సంతకాలు.. వాంఖడేకి లంచం.. షారుఖ్ మేనేజర్ కూడా?

    |

    ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పెద్ద ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. ప్రధాన సాక్షి, కేపీ గోసవి అంగరక్షకుడు ప్రభాకర్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన ప్రభాకర్ ఇప్పుడు రివర్స్ అయ్యాడు. ఈ కేసులో డ్రగ్స్ రికవరీ చేశారా? లేదా? అనేది తనకు తెలియదని ఆయన వెల్లడించారు. తన వద్ద పది బ్లాంక్ పేపర్‌లపై సంతకం తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి భారీగా మొత్తం చేతులు మారిందని కూడా ఆయన ఆరోపించారు. ఆ వివరాల్లోకి వెళితే

     సంచలన విషయాలు లీక్

    సంచలన విషయాలు లీక్

    షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆర్యన్ ఖాన్ కేసులో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది, ఇందులో NCB చేసింది పక్కా ఫ్రాడ్ అని చెప్పడమే కాకుండా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లాని పేరు కూడా ప్రస్తావించబడింది. ఆర్యన్ ఖాన్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో, సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ ద్వారా గోసవి అనేక విషయాలను పంచుకున్నారు.

    ఖాళీ పేపర్‌పై బలవంతంగా సంతకాలు

    ఖాళీ పేపర్‌పై బలవంతంగా సంతకాలు

    ఇక ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన రోజున, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోటో ఆర్యన్ తో వైరల్ అయింది. ఈ వ్యక్తిని కిరణ్ గోసావిగా గుర్తించి, గుర్తించిన తర్వాత నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ఆ కిరణ్ గోసావి యొక్క అంగరక్షకుడు ప్రభాకర్ ఈ విషయాన్ని లీక్ చేశారు. డ్రగ్స్ దాడి కేసులో కేపీ గోసవితో పాటు ప్రభాకర్ మరో సాక్షిగా ఉన్నారు. కేపీ గోసవి అంగరక్షకుడయిన ప్రభాకర్ నోటరీ చేయబడిన అఫిడవిట్‌లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు. ఎన్‌సీబీ కార్యాలయంలో పంచనామా పేపర్‌ అని చెప్పి ఖాళీ పేపర్‌పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ప్రభాకర్‌ తెలిపారు. ఈ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన విషయంపై తన వద్ద పెద్దగా సమాచారం లేదని అన్నారు. పెద్ద పెద్ద కేసుల్లో సాక్షులు హతమవ్వడం లేదా కనిపించకుండా పోవడం చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. అదే తరహాలోనూ తనకూ ప్రాణ హానీ ఉన్నదని తెలిపారు.

    ప్రాణ హాని

    ప్రాణ హాని

    ఇన్ని విషయాలు తెలిసిన తనను ఎన్‌సీబీ అధికారి ఊరికే వదిలిపెట్టబోడని భయపడుతున్నట్టు వివరించారు. కాబట్టి, తనకు తెలిసిన నిజాలన్నింటినీ బయటపెట్టి తన ప్రాణాలు రక్షించుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 10 ఖాళీ కాగితాలపై సాక్షులుగా సంతకం తీసుకుందని పేర్కొన్నారు. అఫిడవిట్‌లో, తాను కిరణ్ గోసవితో బాడీగార్డ్‌గా పనిచేసేవాడినని ప్రభాకర్ పేర్కొన్నాడు. క్రూయిజ్‌లో రైడ్ అయిన రాత్రి తాను గోసవితో ఉన్నానని కూడా చెప్పాడు. ఆ రాత్రి ఎన్సీబీ ఆఫీస్ దగ్గర సామ్ అనే వ్యక్తిని గోసవి కలవడం చూశానని భాకర్ చెప్పారు.

    25 కోట్ల డీల్

    25 కోట్ల డీల్

    ప్రభాకర్ తన అఫిడవిట్‌లో చెబుతున్న దాని ప్రకారం, గోసవి ఎన్సీబీ కార్యాలయం వెలుపల సామ్ డిసౌజాను కలిశాడు. ఆ సమయంలో ఆయన కెపి గోసవిని కలవడానికి దిగువ పరేల్, బిగ్ బజార్ సమీపంలోని ఎన్‌సిబి కార్యాలయం నుండి ఇద్దరూ తమ సొంత కారులో వచ్చారని అన్నారు. గోసావి సామ్ తో ఫోన్‌లో రూ. 25 కోట్ల గురించి మాట్లాడుతున్నారని మరియు దానిని 18 కోట్లకు ఫిక్స్ చేయడం గురించి కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అందులో సమీర్ వాంఖడేకి 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు మాట్లాడాడని అన్నారు.

    షారుఖ్ మేనేజర్ కూడా?

    షారుఖ్ మేనేజర్ కూడా?

    అలా ఈ వ్యవహారం తరువాత నీలం రంగు మెర్సిడెస్ కారు లోయర్ పరేల్‌కు చేరుకుందని, ఆ కారులో షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లాని ఉన్నారని అన్నారు. కారులో, కెపి గోసవి మరియు సామ్ పూజా దడ్లానితో సమావేశమయ్యారని, 15 నిమిషాల తర్వాత మేము అక్కడ నుండి మంత్రాలయం వైపు బయలుదేరామని అన్నారు. గోసవి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి, ఆపై వాషికి వెళ్ళాడని అక్కడికి చేరుకున్న తర్వాత, గోసావి మీరు ఇన్నోవా కారు తీసుకుని టార్డియోకి వెళ్లండి, అక్కడ ఒకరి నుండి ₹50 లక్షల నగదు తీసుకోండని చెప్పగా నేను డబ్బు తీసుకున్నానని ఆ తర్వాత వాషికి చేరుకున్న తర్వాత, బ్యాగ్‌ని కిరణ్ గోసావికి ఇచ్చానని అన్నారు.

    English summary
    Twist In Aryan Khan Case arouses as Witness Prabhakar Sail Claims Kiran Gosavi Was Talking To Sam disouja About Paying Off Sameer Wankhede 8 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X