Divorce: గోవిందా డైవోర్స్ కేసులో ట్విస్ట్.. భార్య లీగల్ నోటీసుపై క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా తన భార్యతో విడాకులు తీసుకొంటున్నారనే వార్త జాతీయ మీడియాలో టాప్ హెడ్‌లైన్‌గా మారింది. 37 వైవాహిక బంధానికి ముగింపు పలికి సునీత అహుజాతో డైవోర్స్ సిద్దమయ్యారనే వార్త మీడియాను కుదిపేసింది. అయితే ఈ వార్త విషయంలో అనేక రూమర్లు బయటకు వచ్చాయి. అయితే సంచలనంగా మారిన విషయంపై అటు సునీతా అహుజా గానీ, గోవిందా గానీ స్పందించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విడాకుల వ్యవహారంలో చోటుచేసుకొంటున్న పరిణామాల వివరాల్లోకి వెళితే..
కొద్ది నెలల క్రితం ఇంటర్వ్యూలో గోవింద భార్య సునీతా సంచలన విషయాలు వెల్లడించారు. తాము చాలా కాలం నుంచి కలిసి ఉండటం లేదు. మేము వేర్వేరుగా ఉంటున్నాం. నేను నా పిల్లలతో ఓ బంగ్లాలో ఉంటున్నాం. నా భర్త గోవిందా వేరే బంగ్లాలోనే మా స్ట్రీట్‌లోనే ఉంటున్నారు. చాలా కాలంగా ఆయన మాతో ఉండటం లేదు అని ఆమె వెల్లడించారు. దాంతో ఒక్కసారిగా గోవిందా దంపతులు విడిపోయారు అనే వార్త వైరల్ అయింది.

ఇదిలా ఉండగా, కొద్ది నెలల క్రితం గోవిందాకు ఆయన భార్య లీగల్ నోటీసు పంపించింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం గురించి విషయాలు బయటకు రాలేదు. కానీ వారిద్దరూ మాత్రం విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారు. అందుకే లీగల్ నోటీసులు పంపించారు. ఆ వ్యవహారంలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాలు కథనాన్ని వెల్లడించాయి.
అయితే గోవిందా విడాకుల విషయంలో గోవిందా మేన కోడలు ఆర్తీ సింగ్ స్పందించింది. గోవిందా, సునీతా మధ్య విడాకుల విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆ వార్తలన్నీ నిరాధారమే. వారిద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా నా ఫ్యామిలీతో కనెక్ట్ కాలేదు. నేను ముంబైలో ప్రస్తుతం లేను. కాబట్టి ఇంకా ఎక్కువ సమాచారం తెలియదు అని ామె అన్నారు.

గోవింద ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే.. సునీతను మార్చి 1987 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారిద్దరికి యశ్వర్ధన్ అహుజా, నర్మద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దాదాపు 37 సంవత్సరాలుగా వారి కాపురం సవ్యంగా సాగుతున్నది. ఈ మధ్య కాలంలోనే వారి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయనే వార్తలు మీడియాలో గుప్పు మంటున్నాయి. ఈ విషయంపై గోవింద కూడా పెదవి విప్పకపోవడంతో అవి రూమర్లుగానే ఉండిపోయాయి.


Click it and Unblock the Notifications











