బెటింగ్ యాప్ స్కామ్‌లో భారీ ట్విస్ట్.. 6000 కోట్ల కుంభకోణంలో తమన్నాతోపాటు టాప్ సింగర్, జాక్వలైన్!
ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ మహాదేవ్‌ను ప్రమోట్ చేసిన విషయంలో బాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియాకు ముంబై సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ దత్, జాక్వలైన్ ఫెర్నాడేజ్, సింగర్ బాద్షాలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో వారి ప్రమేయంపై ఓ ట్విస్టు బయటకు వచ్చింది. ఆ ట్విస్టు వివరాల్లోకి వెళితే...
మహాదేవ్ యాప్‌కు చెందిన ఫెయిర్ ప్లే యాప్‌లో అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచుల స్ట్రీమింగ్‌ను చేశారు. ఆ యాప్‌కు బాలీవుడ్ ప్రముఖులు ప్రమోషన్స్ చేశారు. దాని వల్ల మాకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అందుచేత తమన్నా, సంజయ్ దత్, జాక్వలైన్, బాద్షాకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ కేసును రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్ కేసు నమోదు చేసింది.

అయితే ఈ కేసులో సినీ ప్రముఖులందరినీ సాక్షులుగానే విచారణకు పిలుస్తున్నాం. వారి నుంచి యాప్‌కు సంబంధించిన వ్యవహారాలను, ప్రమోషన్స్ వెనుక కారణాలను, వారికి అందిన డబ్బు వివరాల గురించి ప్రశ్నించే అవకాశ ఉంది.
చత్తీస్‌గడ్‌కు చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ ఇద్దరు దుబాయ్ నుంచి ఈ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తునున్నారు. మహాదేవ్ యాప్ కోసం బాలీవుడ్ హీరోలు రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ యాడ్స్ చేశారు. బెట్టింగ్ యాప్‌ను వినియోగించాలని వారు యాడ్స్‌లో చెప్పారు. ఆ విషయంలో వారిని విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.

మహాదేవ్ యాప్ బెట్టింగ్ కుంభకోణంలో సుమారుగా 6000 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టింది. దాంతో ఈ వ్యవహారంలో సంజయ్ దత్‌కు నోటీసులు జారీ చేయగా, విచారణకు గైర్హాజరు అయ్యారు. మరో డేట్ చెబితే విచారణకు వస్తానని చెప్పారు.


Click it and Unblock the Notifications











