Saif Ali Khan: సైఫ్ ఆలీ ఖాన్ దాడి కేసులో షాకింగ్ ట్విస్టులు.. ముంబైలో డొంక లాగితే బెంగాల్‌లో.. !

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఎటాక్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. అయితే ఈ కేసులో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వివరాలు భారీ ట్విస్టులను తలపిస్తున్నాయి. అయితే నిందితుడు అరెస్ట్ విషయంలో పోలీసులకు వెల్లడైన షాకింగ్ విషయాలు, అలాగే ఈ కేసులో మరొకరి అరెస్ట్ కూడా దాడి ఘటనలో అనేక అనుమానాలను బయటపెడుతున్నాయి. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సైఫ్ ఆలీ ఖాన్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులకు షాకింగ్ విషయాలు ముందుకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్‌ దాడి సంఘటన వద్ద లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కాకపోవడంతో ఈ కేసులో నిందితుడు ఎవరు అనే విషయం మళ్లీ మొదటికి వచ్చింది. ముంబై పోలీసులు అరెస్ట్ చేసింది అసలైన ఎటాకర్‌ను కాదా? అనే డౌట్ మొదలైంది. దాంతో ఈ దాడిలో సైఫ్‌ను కత్తితో పొడిచింది ఎవరనేది ప్రశ్నగా మారింది.

Twist in Sail Ali Khan s Murder Attempt Case Mumbai Police Arrested Woman in West Bengal

ఇదిలా ఉండగా, ఈ కేసులో అరెస్ట్ చేసిన అనుమానితుడి జీవితం డైలామాలో పడింది. అరెస్ట్ అయిన వ్యక్తికి దాడి ఘటనతో సంబంధం లేదని తెలిసిన తర్వాత అంతకు ముందు జరిగిన నిశ్చితార్థం రద్దైంది. పోలీసుల చేసిన తప్పుకు ఆకాశ్ అనే వ్యక్తి పెళ్లి ప్రపోజల్ ఆగిపోవడం వారి కుటుంబ సభ్యుల్లో ఆవేదనకు గురి చేసింది. తన అరెస్ట్ తర్వాత పెళ్లి కూతురు కుటుంబం సభ్యులు పెళ్లి ప్రపోజల్‌ను క్యాన్సిల్ చేశారని తన అమ్మమ్మ చెప్పారు.

ఇదిలా ఉండగా, సైఫ్ దాడి కేసులో ఓ మహిళను పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ చేయడం మరింత సంచలనం రేపింది. కుకుమోని జహంగీర్ షేక్ అనే మహిళను నాడియా జిల్లాలో అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముంబై పోలీసుల విచారణలో ఈ మహిళ ఓ సిమ్‌ను ఉపయోగించారనే విషయం వెల్లడైంది. అయితే మహిళను ముంబై తీసుకు రావడానికి బెంగాల్ పోలీసుల అనుమతిని కోరుతున్నట్టు సమాచారం.

Twist in Sail Ali Khan s Murder Attempt Case Mumbai Police Arrested Woman in West Bengal

సైఫ్ కేసులో అరెస్ట్ అయిన షారీఫుల్ ఫకీర్‌కు ఈ మహిళకు సంబంధాలు ఉన్నాయి. ఫకీర్‌ బంగ్లా దేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డారు. ఆ తర్వాత మహిళతో టచ్‌లో ఉన్నాడు. అరెస్టైన మహిళ ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆమెను ముంబై తీసుకొచ్చి విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. మహిళ అరెస్ట్‌ను బెంగాల్ పోలీసులు ధృవీకరించారు. దాంతో ఈ కేసు డొంక ముంబైలో లాగితే బెంగాల్‌లో కదిలింనే చందంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X