twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ రోషన్ మూవీ సెట్ నుంచి ఇద్దరు అనుమానితుల అరెస్ట్... టెర్రరిస్టులా?

    |

    ముంబైలో పోలీసులు, కోస్ట్ గార్డ్ సోమవారం(మే 27)న హై అలర్ట్ ప్రకటించారు. సమీపంలోని పాల్‌ఘర్ తీర ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఇస్లామిక్ టెర్రరిస్టుల మాదిరిగా ఉండి అనుమానాస్పదంగా సంచరించడమే ఇందుకు కారణం. అనుమానితులను పోలీసులు వెంబడించి అరెస్ట్ చేశారు.

    అయితే చివరకు తేలింది ఏమిటంటే వారు టెర్రరిస్టులు కాదని, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న యాక్టర్లు అని స్పష్టమైంది. 2008లో సముద్ర మార్గం గుండా ముంబై నగరంలో చొరబడిన పాకిస్థాన్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన తర్వాత పోలీసులు తీర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజా సంఘటన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    సెక్యూరిటీ గార్డ్ సమాచారం ఇవ్వడంతో అలర్ట్

    సెక్యూరిటీ గార్డ్ సమాచారం ఇవ్వడంతో అలర్ట్

    పంచవటి నాకా ఏరియాలోని ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న అనిల్ మహాజన్ ఇద్దరు వ్యక్తులను చూసి టెర్రరిస్టులుగా అనుమానించాడు. వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సిగరెట్లు కొనడానికి ఓ షాపు వద్ద ఆగాడు, మరొక వ్యక్తి అనుమానాస్పదంగా పరిసరాలు గమనిస్తూ వ్యాన్లో కూర్చున్నాడు. ఈ విషయాన్ని వెంటనే అతడు పోలీసులకు అందించారు. దీంతో చుట్టు పక్కల ప్రాంతంలోని 7 స్టేషన్లలోని పోలీసులతో పాటు కోస్ట్ గార్డ్ అలర్ట్ అయ్యారు.

    రంగంలోకి దిగిన పోలీసులు

    రంగంలోకి దిగిన పోలీసులు

    సదరు అనుమానిత వ్యక్తి ఆర్మీ దుస్తులు ధరించి... తుపాకీ తూటాలు స్టోర్ చేసుకునే కార్టిర్జ్ బెల్ట్ ధరించి ఉన్నాడు. సెక్యూరిటీ గార్డ్ అనిల్ మహాజన్ ఇంతకు ముందు బిఎస్ఎఫ్‌లో పని చేశాడు. ఈ అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ ఆఫీసర్‌గా పని చేస్తున్న తన సోదరుడికి అందించగా...అతడు కంట్రోల్ రూముకు సమాచారం ఇచ్చాడు. దీంతో మానిక్ పూర్ పోలీస్ స్టేషన్ నుంచి సీనియర్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ రాజేంద్ర కాంబ్లే సీపీ టీవీ పుటేజీ పరిశీలించి వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఎటువైపు వెళుతుందో తెలుసుకుని నలసోపారా ప్రాంతంలో అడ్డగించి అరెస్ట్ చేశారు. విచారణలో వారు జూనియర్ ఆర్టిస్టులు అని తేలింది.

    కేసు నమోదు చేసిన పోలీసులు

    కేసు నమోదు చేసిన పోలీసులు

    ఈ విషయమై యష్ రాజ్ ఫిలింస్ వారు ముంబై మిర్రర్ పత్రికతో మాట్లాడుతూ...తమకు పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ జారీ చేయలేదని తెలిపారు. అయితే పోలీసులు యూనిట్ ఇంచార్జి, సెట్ కోఆర్డినేటర్, ఆ ఇద్దరు యాక్టర్ల మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

    ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ హెచ్చరిక

    ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ హెచ్చరిక

    ఇండియాపై ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ మార్చి 2019లో సమాచారం అందించడంతో అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, తీర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ముంబైలో అనుమానితులు కంటపడగానే అలర్ట్ అయ్యారు.

    English summary
    Two men arrest by The Mumbai Police, but it turned out that they were actors working on the Hrithik Roshan-Tiger Shroff movie being made by Yash Raj Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X