అందుకోసమే సల్మాన్ కు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు గతనెలలో కొన్ని బెదిరింపులు ఎదురైన సంగతి తెలిసిందే. కష్ణ జింక కేసు విషయంలో వచ్చిన ఈ బెదిరింపులు.. అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. సల్మాన్ ను చంపేస్తామని దుండగలు పెట్టిన పోస్టులు సంచలనం రేపాయి.
సల్మాన్ చుట్టూ ఎన్ని కేసులు ఉన్నా.. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అయితే సినిమాలు విజయం సాధిస్తూ.. దూసుకుపోతున్న ఈ కండలవీరుడుకు ఈ కేసులు మాత్రం మాయని మచ్చలా మారాయి. అయితే సల్మాన్ ను చంపేస్తామంటూ బెదిరించిన ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జాకీ బిష్నోయ్ అలియాస్ లారెన్స్ బాబల్, జగదీష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జోధ్ పూర్ పోలీసాఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అయితే వీరిద్దరు ఫేమస్ అవ్వడానికే ఈ బెదిరింపులకు పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. వీరు చిక్కింది వేరే కేసులో అయినా.. అనుమానం వచ్చిన పోలీసులు వారిద్దరిని కడిగేయడంతో ఈ నిజం కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ స్మగ్లింగ్, వాహనాలు దొంగతనం చేయడమే వీరి పని. డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి తాజాగా ఓ లగ్జరీ కారును ఎత్తుకెళ్లారు.అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి విచారించడంతో వారు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే విషయం తెలిసిందని తెలిపాడు. చివర్లో మరో నిజం తెలిసిందంటూ.. సల్మాన్ ఖాన్ ను బెదిరించింది కూడా ఈ జాకీనే అని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











