4 చుక్కలు 40 ని. కిక్కు.. దీపిక పదుకోన్ వాట్సాప్ ఛాట్‌ లీక్.. డ్రగ్ కేసులో మేనేజర్ కరిష్మాకు సమన్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి తీగను లాగితే డొంక కదిలినట్టు టాప్ హీరోయిన్ల జాబితా అంతా బయటపడుతున్నది. ఇప్పటికే రియా అరెస్ట్ తర్వాత అందరి చూపు ఆమెతో టచ్‌లో ఉన్న టాప్ హీరోయిన్లపై పడింది. రియా విచారణలో టాప్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అనధికారికంగా లీకులు ఇస్తున్నారు. ఈ డ్రగ్స దర్యాప్తు విచారణలో వెలుగు చూసిన ఆ ఇద్దరు టాప్ హీరోయిన్లు ఎవరంటే..

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత

రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత బాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర హీరోయిన్లు సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్‌తోపాటు మరో అగ్ర హీరోయిన్ పేరు మీడియాలోను, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశాలుగా మారాయి. అయితే ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్టు జాతీయ మీడియాకు చెందిన టెలివిజన్ ఛానెల్ రిపబ్లిక్ సంచలన కథనాలు వెల్లడిస్తున్నారు.

దీపిక పదుకోన్, ఆమె మేనేజర్ కరిష్మా పేర్లు

దీపిక పదుకోన్, ఆమె మేనేజర్ కరిష్మా పేర్లు

డ్రగ్ రాకెట్ కేసులో సారా ఆలీ ఖాన్, శ్రద్దా కపూర్ పేర్ల తర్వాత దిపికా పదుకోన్ పేరు తెరపైకి వచ్చింది. వాట్సప్ చాట్‌లో D, K పేర్లు బయటకు రావడంతో ఆ అక్షరాలను దీపిక పదుకోన్ పేరు, ఆమె మేనేజర్ కరిష్మగా దృవీకరించారు. ఈ వ్యవహారంలో దీపిక మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్‌లో కలకలం చేలరేగుతున్నది.

రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్‌ను విచారించగా

రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్‌ను విచారించగా

రియా చక్రవర్తికి చెందిన టాలెంట్ మేనేజర్ జయ సహాను ఎన్సీబీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం లోతుగా విచారించింది. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌ నుంచి ఇద్దరు టాప్ హీరోయిన్లుగా భావిస్తున్న బాలీవుడ్ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఆ వాట్సప్ ఛాటింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

D, K అంటూ హీరోయిన్ల పేర్లు

D, K అంటూ హీరోయిన్ల పేర్లు

అక్టోబర్ 2017లో డ్రగ్స్ డీలర్స్‌తో వాట్సప్‌ యాప్‌లో జరిపిన సంభాషణ ఎన్సీబీ అధికారులు దృష్టికి వచ్చింది. D, K పేరుతో మొదలయ్యే హీరోయిన్లు డ్రగ్స్ కోసం సంప్రదింపులు జరిపినట్టు స్పస్టమైంది. నాకు హాష్ కావాలి.. వీడ్ వద్దు అంటూ జరిపిన సంభాషణ ఈ దందా గుట్టును బయటపెట్టింది. తాజా రిపబ్లిక్ టీవీ విడుదల చేసిన వాట్సప్ ఛాట్‌ లీక్‌తో బాలీవుడ్‌లో కలకలం మొదలైంది.

Recommended Video

Shraddha Kapoor : లేక్‌హౌజ్‌లో Chhichhore Success Party లో సుశాంత్, శ్రద్దాకపూర్, సారా, రియా !
నాలుగు చుక్కలు.. 10 నిమిషాల కిక్కు

నాలుగు చుక్కలు.. 10 నిమిషాల కిక్కు

తాజాగా లీకైన వాట్సప్ ఛాటింగులో D, K మధ్య జరిగిన సంభాషణలో 4 చుక్కలు ఛాయ్‌లో కలుపుకోని తాగు.. 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు కిక్కే కిక్కు అంటూ వారు చాటింగ్ చేసుకోవడం కనిపించింది. ఈ సంభాషణలో నిషేధిత సీబీడీ ఆయిల్ అంటూ ప్రస్తావించడం కూడా కనిపించింది.

 ఈ వారమే సారా, శ్రద్దా కపూర్‌కు సమన్లు

ఈ వారమే సారా, శ్రద్దా కపూర్‌కు సమన్లు

రియా చక్రవర్తికి సన్నిహితురాలైన టాలెంట్ మేనేజర్ జయ సహా విచారణ తర్వాత ఈ వారం కొందరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే విషయాన్ని ఎన్సీబీ వెల్లడించినట్టు రిపబ్లిక్ టీవీ తెలిపింది. వచ్చే వారం శ్రద్దాకపూర్, సారా ఆలీ ఖాన్‌‌తోపాటు మరి కొందరు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో ఊపందుకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X