సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో అగంతకులు.. రంగంలోకి ముంబై పోలీసులు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్ హౌజ్‌లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించడం కలకలంగా మారింది. గత కొద్దికాలంగా సల్లూభాయ్‌ని చంపివేస్తామని బెదిరింపు కాల్స్ వస్తుండటం వల్ల ఈ వ్యవహారం అందోళనకరంగా మారింది. ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసు గురించి ముంబై పోలీసులు వెల్లడించిన సమాచారం విషయంలోకి వెళితే..
సల్మాన్ ఖాన్‌కు ముంబైకి సమీపంలోని పాన్వెల్‌లో ఫామ్‌హౌస్ ఉంది. తరుచూ ఆయన అక్కడ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వస్తుంటారు. అలాంటి ప్రదేశంలో సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి నిషేధిత ప్రశాంతంలోకి ఇద్దరు వ్యక్తులు నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిద్దరిని అదుపులోకి తీసుకొన్నాం. వారిని అజేశ్ కుమార్ ఓం ప్రకాశ్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ సిఖ్‌గా గుర్తించాం అని ముంబై పోలీసుల తెలిపారు.

అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిద్దరిని విచారించాం. తాము సల్మాన్ ఖాన్ అభిమానులం. ఆయనను కలిసేందుకు వచ్చామని చెప్పారు. కానీ వారు ముందుగా అర్పిత ఫామ్‌హౌస్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పారు. ఆ తర్వాత పొదల చాటున ఉన్న గోడ దూకి ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించారు. వారిని గమనించిన సెక్యూరిటీ గార్డులు వారిని పట్టుకొని మాకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణ అనంతరం సోదా చేయగా వారి వద్ద నుంచి రెండు నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకొన్నాం. వారిని పలు కోణాల్లో ప్రశ్నించాం అని చెప్పారు. మాఫియా డాన్ బిష్ణోయ్ నుంచి డెత్ వార్నింగ్ ఉండటంతో పన్వేల్ ఫామ్‌హౌస్‌కు మరింత భద్రత కల్పించా అని ముంబై పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











