twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వల్ల కావడం లేదు, ఆత్మహత్యకి ఇదే సరైన సమయం.. క్రేజీ నటుడి సంచలన ట్వీట్!

    |

    బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా ధూమ్ సిరీస్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ధూమ్ 2లో ఉదయ్ చోప్రా నటన అందరిని ఆకట్టుకుంది. పోలీస్ గా నటిస్తూనే మంచి హాస్యాన్ని పండించాడు. అలాంటి ఉదయ్ చోప్రా ప్రస్తుతం తీవ్రమైన మానసిక సమస్యలతో భాదపడుతున్నాడు. గత ఏడాది నుంచి ట్విట్టర్ లో ఉదయ్ చోప్రా చేస్తున్న ట్వీట్స్ అతడి మానసిక సమస్యలని తెలియజేస్తున్నాయి. తాజాగా ఉదయ్ చోప్రా చేసిన కొన్ని ట్వీట్స్ అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    బయటపడలేకున్నా

    బయటపడలేకున్నా

    తాజాగా ఉదయ్ చోప్రా తన ట్విట్టర్ అకౌంట్ లో తాను మానసిక సమస్యలతో భాదపడుతున్నాని, ఎంత ప్రయత్నించినా దీని నుంచి బయటపడడం నా వల్ల కావడం లేదని ఉదయ్ చోప్రా ట్వీట్ చేశాడు. అసలు ఉదయ్ చోప్రా ఎందుకు ఎలా అయిపోయాడనే చర్చ బాలీవుడ్ లో జరుగుతోంది. ఉదయ్ చోప్రా ఇంత మానసిక వేదన అనుభవించడానికి కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు.

    ఆత్మహత్యకి సరైన సమయం

    ఆత్మహత్యకి సరైన సమయం

    త్వరలో సోషల్ మీడియాని డీయాక్టివేట్ చేస్తున్నా. ఎంత ప్రయత్నించినా కోలుకోలేకున్నా. మరణానికి దగ్గరగా వెళుతున్నట్లు ఉంది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు ఉదయ్ చోప్రా ట్విటర్ లో సంచలన వ్యాఖ్య చేశాడు. అతడి ట్వీట్స్ ని వెంటనే కుటుంబ సభ్యులు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. 2018 నుంచి ఉదయ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.

     పోలిసుల నుంచి విమర్శలు

    పోలిసుల నుంచి విమర్శలు

    ఉదయ్ చోప్రా గత ఏడాది ఓ ట్వీట్ చేస్తూ ఇండియాలో గంజాయిని చట్టబద్దం చేయాలి. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి మంచిది, మన సంప్రదాయంలో ఇవి కూడా భాగం కావాలి అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అప్పట్లో దుమారం రేపింది. ముంబై పోలీసులు ఉదయ్ చోప్రా తీరుపై మండిపడ్డారు. తన అభిప్రాయాలని చెప్పుకునే హక్కు తనకు ఉందంటూ ఉదయ్ సమాధానం ఇచ్చాడు.

    ప్రేమని కోల్పోయా

    ప్రేమని కోల్పోయా

    ఉదయ్ చోప్రా తన ప్రేమ వ్యవహారం గురించి కూడా 2018లో ట్వీట్ చేశాడు. నేను ప్రేమలో చాలా నిజాయతీగా ఉండాలని అనుకున్నా. కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడ్డా. నా జీవితంలో ఓ అమ్మాయి ఉండేది. ఆ ప్రేమని తాను కోల్పోయానని, ఆజ్ఞాపకాల నుంచి బయటపడాలంటే తాను బయటపడాలంటే వృత్తిపై దృష్టి పెట్టాలని ఉదయ్ చోప్రా ట్వీట్ చేశాడు. ఉదయ్ చోప్రాని అంత ఘాడమైన ప్రేమలోకి దించిన యువతి ఎవరనే విషయం బయట పెట్టలేదు.

    English summary
    Uday Chopra's cryptic tweet leaves fans wondering if the actor is depressed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X