ప్రస్తుతం నా దృష్టి అంతా దాని మీదే.. మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు.. కంగనాపై పరోక్షంగా సీఎం ఫైర్
సుశాంత్ సింగ్ కేసు ఏమో గానీ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్, మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కంగనా రనౌత్ వ్యవహారమే మీడియాలో హైలెట్ అవుతోంది. ఓ వైపు రియా టాపిక్ రన్ అవుతూ ఉంటే.. మరోవైపు శివసేన-కంగనా మాటల యుద్దం వైరల్ అవుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపైనా కంగనా సెటైర్లు వేసింది. ఇక శివసేన నాయకులు, ఎంపీలను సైతం తన మాటలతో కట్టడి చేసింది.

వాగ్వాదం అలా..
ముంబై పోలీసుల మీద నమ్మకం లేదంటూ కంగనా చేసిన కామెంట్లపై సంజయ్ రౌత్ ఫైర్ అవ్వడం వివాదం మొదలైంది. ముంబైలో అడుగుపెట్టొద్దు, రాళ్లతో కొట్టి చంపుతాం అంటూ సంజయ్ రౌత్ బహిరంగంగా బెదిరించాడు. ఇలాంటి బెదిరింపులకు బయపడని కంగనా.. ఏం చేస్తారో చేసుకోండి అని కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన వై సెక్యూరిటీ భద్రతతో ముంబైలో అడుగుపెట్టింది.

కూల్చివేతలపై ఫైర్..
తన కార్యాలయం, ఇళ్లు అక్రమ కట్టడాలంటూ కూల్చివేయడంపై కంగనా రనౌత్ ఫైర్ అయింది. నా ఇళ్లు మీరు కూలగొట్టారు.. మీ అహంకారం కూడా ఏదో ఒక రోజు కూలుతుంది అంటూ ఘాటు విమర్శలు చేసింది. సీఎంను పది తలల రావణుడిగా ఉన్న ఓ మీమ్‌ను కూడా షేర్ చేసింది. అందులో వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయిలా కంగాన యుద్దానికి రెడీ అవుతోన్నట్టుంది.

తాజాగా సీఎం ప్రెస్ మీట్..
తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కామెంట్ చేశారు. కొందరు కరోనా అయిపోయిందని భావించి, రాజకీయాలను ప్రారంభించేశారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ప్రస్తుతం తానేమీ మాట్లాడనని అన్నారు.
Recommended Video

మౌనంగా ఉంటే సమాధానం లేదని కాదు..
ప్రస్తుతం నా దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉంది. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారు. సరైన సమయంలో దీనిపై స్పందిస్తా..నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు, ‘సీఎం ప్రోటోకాల్' ను పక్కనెట్టి మరీ మాట్లాడతానని మరీ పరోక్షంగా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











