లవర్‌తో అడ్డంగా బుక్కైన జాన్వీ కపూర్: పగలు రాత్రి తేడా లేకుండా.. కారులోనే ఆ పనులు చేస్తూ!
సుదీర్ఘ కాలం పాటు తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించి సినీ వినీలాకాశంలో ధృవతారలా ఓ వెలుగు వెలిగారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె తన కూతుళ్లను కూడా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అంతలా ఈ చిన్నది బాలీవుడ్‌లో ఇప్పుడు వరుస సినిమాలతో హవాను చూపిస్తోంది. కెరీర్ పరంగానే కాదు.. పర్సనల్ లైఫ్ విషయాలతోనూ తెగ హైలైట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ ప్రియుడితో దొరికిపోయినట్లు తెలిసింది. అసలేం జరిగింది? ఆ వివరాలను మీరే చూడండి!

వరుస సినిమాలతో సందడి: శ్రీదేవి కూతురిగా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయమైన జాన్వీ కపూర్.. 'ధడక్' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్ అవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో వరుసగా 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్', 'రూహీ', 'గుడ్ లక్ జెర్రీ', 'మిలీ' వంటి చిత్రాల్లో నటించింది. వీటి ఫలితాలు ఎలా ఉన్నా జాన్వీ కపూర్ క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది.

టాలీవుడ్‌లోనూ.. వరుసగానే: బాలీవుడ్ దాదాపు ఐదేళ్లుగా సందడి చేస్తోన్న జాన్వీ కపూర్‌కు చాలా భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ, వేటికీ ఓకే చెప్పని ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలాగే, జాన్వీ కపూర్ త్వరలోనే మహేశ్ బాబు, అల్లు అర్జున్‌తోనూ సినిమాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

చిన్నప్పటి నుంచే డేటింగ్స్: శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ చిన్న వయసులోనే సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో కలకలం రేపాయి.

ఇప్పుడు అతడితో లవ్ ట్రాక్: టీనేజ్ నుంచే జాన్వీ కపూర్ డేటింగ్‌లతో సెన్సేషన్ అయిపోయింది. ఇలా ఇప్పటికే ఎంతో మంది కుర్రాళ్లతో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు బీ టౌన్‌లో ప్రచారం జరిగింది. ఇక, ఇప్పుడు మాత్రం జాన్వీ కపూర్.. శిఖర్ పహారియాతోనే డేటింగ్ చేస్తుందని అంటున్నారు. అందుకే ఇటీవలే అతడిని ఈ క్యూట్ హీరోయిన్ తిరుపతికి కూడా వెంట తీసుకు వచ్చిందని చెప్తున్నారు.
ఉమైర్ సంధు ట్వీట్ షాక్: జాన్వీ కపూర్ ఇప్పుడు శిఖర్ పహారియాతోనే డేటింగ్‌లో ఉందని నార్త్ నుంచి సౌత్ వరకూ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ఆమె గురించి సంచలన ట్వీట్ చేశాడు. అందులో శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ మితిమీరిన రొమాన్స్ చేస్తోందని, తాజాగా ఇద్దరూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని చెప్పుకొచ్చాడు.

కారులోనే ఆ పని చేస్తోంది: తరచూ సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అయిన బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 'జాన్వీ కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ అయిన శిఖర్ పహారియాతో పగలు రాత్రి తేడా లేకుండా ఎంజాయ్ చేస్తోంది. వాళ్లిద్దరూ గత రాత్రి కారులో ముద్దులు పెట్టుకుంటూ దొరికిపోయారు' అంటూ ఊహించని విధంగా కామెంట్ చేశాడు.
కాస్ట్‌లీ గిఫ్టులు ఇచ్చాడని: అంతేకాదు, ఇదే ట్వీట్‌లో ఉమైర్ సంధు 'బాలీవుడ్‌లోని ఇన్‌సైడ్ రిపోర్టుల ప్రకారం.. ప్రతి వారం జాన్వీ కపూర్‌కు శిఖర్ పహారిక ఎంతో విలువైన లేదా ఖరీదైన గిఫ్టులను ఇస్తున్నాడని తెలిసింది' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











