సినీ జంట మధ్య విభేదాలు: బెడ్‌రూంలో భర్తను కొట్టిన స్టార్ హీరోయిన్.. అతడి ట్వీట్‌తో ఇండస్ట్రీలో కలకలం
సినీ రంగంలో ప్రేమ వ్యవహాలు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఈ బంధాలను చాలా తక్కువ మంది మాత్రమే పెళ్లి పీటల వరకూ తీసుకు వెళ్తుంటారు. అలాంటి జంటల్లో బాలీవుడ్ స్టార్లు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జోడీ ఒకటి. వీళ్లిద్దరి పెళ్లి ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వీళ్లిద్దరి వైవాహిక జీవితం సంతోషంగానే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ జంట మధ్య విభేదాలు వచ్చినట్లు తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!
రెండో పెళ్లి చేసుకోవడంతో:బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు గతంలో పెళ్లైన విషయం తెలిసిందే. ఆమె నుంచి విడిపోయిన తర్వాత అతడు.. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌తో డేటింగ్ చేశాడు. ఇలా వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితమే కరీనా - సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది.

ఇద్దరు పిల్లలు.. వివాదాలు:సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం తర్వాత తన వైవాహిక జీవితాన్ని కరీనా కపూర్ సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది. పెళ్లైన కొంత కాలానికే ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. అలాగే, ఈ మధ్యనే రెండో బిడ్డకు కూడా కరీనా జన్మనిచ్చింది. ఈ పిల్లలకు 'తైమూర్', 'జహంగీర్' అనే పేర్లు పెట్టారు. ఈ రెండూ వివాదంగా మారాయి. దీంతో ఈ జంటకు ఈ విషయంలో తలనొప్పులు వచ్చాయి.

డివోర్స్ అంటూ పుకార్లతో:వివాహం జరిగిన తర్వాత నుంచి సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఎంతో అన్యోన్యంగా ఉంటోన్నారు. అదే సమయంలో ఇద్దరూ తమ తమ కెరీర్‌లను కూడా కొనసాగిస్తూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోన్నారు. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయని, ఈ జంట విడాకులు తీసుకోబోతుందని ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం తెలిసిందే.
ఫిల్మ్ క్రిటిక్ షాకింగ్ ట్వీట్:బాలీవుడ్ ఫేమస్ కపుల్ కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్ మ్యారేజ్ లైఫ్‌ను చక్కగా నడుపుకుంటోన్నారు. అయినప్పటికీ వీళ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.. కరీనా - సైఫ్ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది.

బెడ్‌రూంలో గొడవపడ్డారు:ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు తరచూ సినీ సెలెబ్రిటీల గురించి వివాదాస్పద పోస్టులు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా అతడు కొందరు తారలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 'గత రాత్రి కరీనా కపూర్.. తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో తీవ్ర స్థాయిలో గొడవ పడింది' అంటూ ఉమైర్ పోస్ట్ చేశాడు.

అక్కడ కొట్టింది అంటూ:ఇదే ట్వీట్‌లో బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు 'సైఫ్ అలీ ఖాన్ ముఖంగా కరీనా కపూర్ దారుణంగా కొట్టింది. వీళ్లిద్దరి మధ్య ఏదో పెద్దగానే జరిగింది. కానీ, దాన్ని ఇప్పుడు రివీల్ చేయలేను' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోంది. అదే సమయంలో వీళ్లిద్దరి అభిమానుల అసలు ఏం జరిగింది? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











