శృంగారం లేకుండా హీరోయిన్ ఉండలేదు.. అందుకే భర్తను వదిలేసి.. షాకింగ్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ సీనియర్ అండ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో ఛయ్యా ఛయ్యా అంటూ స్పెషల్ సాంగ్ చేసి ఓ రేంజ్ లో పాపులర్ అయింది. తెలుగులో పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే పాటతో టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం పరిచయమవడమే కాకుండా హాట్ బ్యూటిగా పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియోలతో హీట్ పుట్టిస్తున్న ఈ 49 ఏళ్ల హాట్ బాంబ్ మలైకాపై చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వీజేగా కెరీర్ స్టార్ట్ : బ్యూటిఫుల్ మలైకా అరోరా అక్టోబర్ 23 1973లో మహారాష్ట్రలోని థానేలో జన్మించింది. మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత (ఏంజెల్) అని అర్థం. ఆమెకు 11 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత తల్లి, సోదరి అమృత అరోరాతో కలిసి చెంబూరుకు మారింది. అనంతరం వీజేగా తన కెరీర్ ప్రారంభించింది మలైకా అరోరా.

మోడలింగ్ లో :ఎమ్ టీవీ క్లబ్ షోలకు హోస్ట్ గా పనిచేసిన మలైకా అరోరా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అంద చందాలతో తెగ పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సమయంలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ గ్లామరస్ బ్యూటి. అయితే సినిమాల పరంగా ఆమెకు అంతగా అక్కడ సక్సెస్ రాలేదు.

ఐటమ్ సాంగ్స్ తో :ఇక బాలీవుడ్ లో ఐటెం గర్ల్ గా మారింది హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది మలైకా అరోరా. 'ఛయ్య ఛయ్య', 'అనార్కలీ డిస్కో ఛలీ', 'మున్నీ బద్నామ్ హుయి' వంటి సాంగ్స్‌తో తెగ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే, తెలుగులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు 'అతిథి' సినిమాలో 'రాత్రైనా నాకు ఓకే', 'గబ్బర్ సింగ్'లో 'కెవ్వు కే'క పాటల్లో హాట్ షోతో అట్రాక్ట్ చేసింది.

తొమ్మిదేళ్లపాటు : ఇలా స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న మలైకా అరోరా కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉండగా.. బాబుకు జన్మనిచ్చింది మలైకా అరోరా. 2017లో పలు వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది ఈ బ్యూటి.

సీక్రెట్ గా ట్రాక్ : భర్తతో విడిపోయిన తర్వాత తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ మొదలెట్టింది. మొదట్లో సీక్రెట్‌గా ట్రాక్ నడిపించిన ఈ జంట ఇటీవల కాలంలో మరింతగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం, హాలీడే ట్రిప్పులకు వెళ్లడం, ఒకే చోట ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
అతనితో రొమాన్స్ :మూవ్ ఇన్ విత్ మలైకా తదితర షోలతో బిజీగా ఉన్న మలైకా అరోరా తాజాగా జిమ్ నుంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కింది. ఈ వీడియోను షేర్ చేస్తూ సినీ క్రిటిక్ గా పిలవబడే ఉమర్ సంధు షాకింగ్ కామెంట్స్ చేశాడు. "మలైకా అరోరా శృంగారం లేకుండా ఉండలేదు. అందుకే భర్త అర్బాజ్ ఖాన్ ను వదిలేసింది. ఇటీవల యూరప్ నుంచి వచ్చిన మలైకా అక్కడ అర్జున్ కపూర్ తో రొమాన్స్ చేసింది" అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











