twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన లెస్బియన్ మూవీ ఇపుడు అందులో చూడొచ్చు!

    By Bojja Kumar
    |

    ఇటీవల కాలంలో సెన్సార్ బోర్డు కొన్ని సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. అభ్యంతరకంగా ఉన్న సన్నివేశాలను కట్ చేయడం, కొన్ని సార్లు సినిమా మొత్తాన్ని బ్యాన్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలా 2015లో పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెన్సార్ బోర్డు నిషేదించిన చిత్రం 'అన్‌ఫ్రీడమ్'.

    నిషేదానికి గురైన 'అన్‌ఫ్రీడమ్' చిత్రాన్ని ఇపుడు మనం నెట్‌ఫిక్స్‌లో చూడొచ్చు. ప్రఖ్యాత డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నిషేదానికి గురైన ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి తమ ఫ్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తోంది. డిజిటల్ మాధ్యమంలో సెన్సార్ బోర్డు నిబంధనలు వర్తింవనే సంగతి తెలిసిందే.

    'అన్ ఫ్రీడమ్' చిత్రానికి రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదిల్ హుస్సేన్, విక్టర్ బెనర్జీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. లెస్బియన్ లవ్ స్టోరీ, టెర్రర్ కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో తీవ్రమైన అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో నిషేదానికి గురైంది.

    నెట్ ఫిక్స్ లాంటి పాపులర్ డిజిటల్ మాధ్యమం ద్వారా 'అన్ ఫ్రీడమ్' చిత్రం విడుదల కావడంపై దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలో సెన్సార్ బోర్డ్ వ్యవస్థ సరిగా లేదని, క్రియేటివిటీని, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.

    'అన్ ఫ్రీడమ్' మూవీలో రెండు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. రిలీజియస్ ఫండమెంటలిసమ్, ఇంటోలరెన్స్ అంశాలను బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందించారు. న్యూయార్క్, న్యూఢిల్లీ మధ్య సాగుతుంది. ముస్లిం టెర్రరిస్ట్.. ముస్లిం స్కాలర్ మధ్య జరిగే ఒక కథ, ఇద్దరు మహిళల మధ్య జరిగే లెస్పియన్ రొమాన్స్ చుట్టూ మరో కథతో ఈ సినిమా తెరకెక్కించారు.

    English summary
    Bollywood movie Unfreedom was banned in India by the Pahlaj Nihalani-led Central Board of Film Certification (CBFC), on the grounds that it would “ignite unnatural passions”, the film has been acquired by Netflix and can be watched by the streaming service’s subscribers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X