అర్థరాత్రి హోటల్ కు రమ్మని వేధించాడు.. స్టార్ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ కామెడీ యాక్టర్ కపిల్ వర్మ (kapil sharma)హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'ది కపిల్ వర్మ టాక్ షో' గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ షోలో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెబుతూ ఉంటారు. వారి జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటారు. అలా తాజాగా ఈ షోలో ఓ ప్రముఖ నటి పాల్గొని ఓ స్టార్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అమ్మడు ఎవరు? ఇంతకీ బ్యూటీ ఏం కామెంట్స్ చేసిందంటే?

షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ నటి ఎవరో కాదు.. ఉపాసన సింగ్ (upasana singh). జుడ్వా, మేన్ ప్రేమ్ కి దీవానీ హూన్ వంటి చిత్రాలలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ యంగ్ హీరోయిన్ ఉపాసనా సింగ్ ఇటీవల ది కపిల్ వర్మ టాక్ షోలో పాల్గొన్నది. ఈ సమయంలో తన కెరీర్‌లో చాలా కష్టమైన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే.. ఓ సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ తనను ఓ హోటల్‌కి పిలిపించాడని, సిట్టింగ్ అంటే అర్ధం తెలియదా? అని కోప్పడ్డాడని, ఆయన సినిమాలో తనను ఫైనల్ చేసినా చివరి క్షణంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నారనీ, ఆ అవమానంతో దాదాపు ఏడు రోజుల పాటు గదిలో నుంచి బయటకు రాలేదంట. అసలేం జరిగిందంటే?

Upasana Singh Says South Director Asked Her To Meet At Hotel For Anil Kapoor Film

ది కపిల్ వర్మ టాక్ షో లో హీరోయిన్ ఉపాసన మాట్లాడుతూ.. 'అనిల్ కపూర్‌ హీరోగా ఓ పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ సినిమా తీయాలని ఫ్లాన్ చేశారు. అందులో నన్ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. సినిమాకు అగ్రిమెంట్ పై కూడా సైన్ చేశాను. ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించిన మీటింగ్ నన్ను పిలిచారు. నేనెప్పుడూ మా అమ్మ లేదా చెల్లితో కలిసి డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లేదాన్ని. ఒకరోజు నన్ను అడిగాడు. 'నువ్వు ఎప్పుడూ నీతో వేరే వారిని ఎందుకు వస్తావు?' ఒక రోజు రాత్రి తర్వాత రాత్రి 11:30 గంటలకుఫోన్ చేసి సిట్టింగ్ కోసం హోటల్ కి రమ్మని పిలిచారు. నేను నిరాకరించి, హోటల్‌కి వెళ్ళే స్తోమత లేకపోవడంతో మరుసటి రోజు కథ వింటాను అని చెప్పాను. నేను అలా అనగానే.. సిట్టింగ్ అంటే అర్ధం తెలియదా అని కోప్పడ్డాడు.' అంటూ బాధపడింది.

అలా అవమానించే సరికి నిద్ర సరిగా పట్టలేదని ఉపాసన చెప్పింది. మరుసటి రోజు తాను డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లాననీ, ఆ సమయంలో ఆ డైరెక్టర్ కొంతమందితో సమావేశమయ్యాడు. ఆయన కార్యాలయం బాంద్రాలో ఉంది, నేను ఉదయాన్నే అక్కడికి చేరుకున్నాను. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పింది. కానీ నేను వేచి ఉండలేదు. ఎటువంటి మొహమాటం లేకుండా కార్యాలయంలోకి వెళ్లాను. దీంతో ఆ డైరెక్టర్ ఘోరంగా అందరిముందు దుర్భాషలాడాను. దీంతో ఆఫీస్ నుంచి బయటకు రాగానే అనిల్ కపూర్ సినిమాలో వేరే అమ్మాయిని తీసుకున్నారని చెప్పారు. దీంతో ఏడుస్తూ.. ఇంటికి వెళ్లిపోయానని ఉపాసన చెప్పింది.

Upasana Singh Says South Director Asked Her To Meet At Hotel For Anil Kapoor Film

ఈ సంఘటన తర్వాత తాను ఏడు రోజుల పాటు తన గదిలో బయటకు రాలేదనీ, కంటిన్యూగా ఏడుస్తూనే ఉండిపోయానని ఎమోషనల్ అయింది. 'నేను ఏడు రోజులు గది నుండి బయటకు రాలేదు, నిరంతరం ఏడుస్తూనే ఉన్నాను, ఇంట్లో ఏమి చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. కానీ ఆ ఏడు రోజులు నన్ను నేను నమ్మను. సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లకూడదని, మా అమ్మ గురించి ఆలోచించానని. కంటిన్యూగా ప్రయత్నించాననీ, ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నానని తన కథను చెప్పుకొచ్చింది నటి ఉపాసన. ఈ అమ్మడు కెరీర్ లో 'జుదాయి', ఓ మై ఫ్రెండ్ గణేశా, జుడ్వా 2 వంటి హిందీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు టీవీ సీరియల్స్, షోలతో పాటు నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X