Urfi Javed: పాపం ఉర్ఫీ జావేద్.. ఇల్లు కోసం పడరాని పాట్లు.. ఉర్ఫీని చూసి భయపడుతున్న ముంబై వాసులు!
వెరైటీ డ్రెస్సులు, విభిన్నంగా అందాల ఆరబోత, ట్రోలింగ్, బెదిరింపులు, వివాదాలు ఇవన్నీ కలబోస్తే ఉర్ఫీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ భామ వేసిన డ్రస్సులు మొదట్లో చూసిన నెటిజన్లు షాక్ అయ్యేవారు. రోజుకో వింత డ్రెస్సుతో మరింత విభిన్నంగా కనిపించేది ఈ ముద్దుగుమ్మ. అయితే రాను రాను ఉర్ఫీ జావేద్ స్టైల్ కు అలవాటు పడిపోయారు. ఎప్పుడైనా ఉర్ఫీ జావేద్ సాధారణమైన చుడీదార్ వంటి పద్ధతి గల దుస్తులు ధరిస్తే తను ఉర్ఫీనేనా అని అనుమానం కలిగించేలా ఈ భామ తన స్టైల్ తోటి జనాల్లోకి నాటుకుపోయింది. అయితే అసలు బట్టలు లేకుండా, అర కొర దుస్తులతో నిత్యం దర్శనం ఇచ్చే ఉర్ఫీ జావేద్ కు కొత్త సమస్య వచ్చి పడింది.

విపరీతంగా ప్రయత్నాలు..
ఉర్ఫీ జావేద్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. ఎందుకంటే వెరైటీ డ్రెస్సులు, ఎవరు ప్రదర్శించని విధంగా అందాల ఆరబోతతో నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడలింగ్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో అందులో నుంచే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం బుల్లితెరపై రాణించేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది.

అనుకున్నంత త్వరగా..
కాంట్రవర్సీలతో, హాట్ ఫొటోషూట్ లతో నిత్యం సోషల్ మీడియా ద్వారా యమ పాపులర్ అయింది ఈ ఉర్ఫీ జావేద్. తన ట్రెండీ వేర్ తో నిత్యం నెటిజన్లు ఔరా అనిపించే ఈ ముద్దుగుమ్మ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది గ్లామరస్ భామ ఉర్ఫీ జావేద్. కానీ తను అనుకున్నంత త్వరగా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు.

హిందీ బిగ్ బాస్ షోలో..
సినిమా ఇండస్ట్రీలో తను అనుకున్నంతలా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర రంగంమైన టెలివిజన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడైన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలన్న ఉద్దేశంతో సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం లభించింది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ వెరైటీ భామ.

పలు పాత్రలతో మంచి పేరు..
బిగ్ బాస్ హౌజ్ ను వీడాక MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్రతో ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది. మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. రెండేళ్ల క్రితం 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో శివానీ భారియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటి.

అద్దెకు ఇచ్చేందుకు భయం..
అయితే ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ టీవీ షోల కంటే తన వస్త్రాధారణతోనే ఎక్కువ పాపులర్ అయింది. అరకొర బట్టల్లో.. తన అందాలను పరిచి యమ క్రేజ్ అందుకుంది. అయితే ఇప్పుడు అదే ఉర్ఫీ జావేద్ కి శాపంగా మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ కు ఉండేందుకు ముంబైలో ఇల్లు దొరకట్లేదట. ఆమెకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ముంబై వాసులు భయపడతున్నారని తెలిపింది. ఈ విషయం గురించి సోషల్ మీడియా ద్వారా ఇటీవల చెప్పుకొచ్చింది ఈ బ్యూటి.

ముస్లిం అయిన కారణంగా..
"ఈ ముంబై నగరంలో అద్దెకు ఉండేందుకు నాకు ఇల్లు లేదా అపార్ట్ మెంట్ దొరకడం బాగా కష్టమైపోయింది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నా. నేను వేసుకున్న దుస్తుల కారణంగా ముస్లిం ఇంటి ఓనర్లు ఎవరూ నాకు అద్దెకు ఇల్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇక హిందువులు.. నేను ముస్లిం అయిన కారణంగా ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు. అన్నింటికి మించి నాకు వస్తున్న బెదిరింపులను చూసి చాలా మంది ఇంటి యజమానులు నాకు అద్దెకు ఇల్లు ఇచ్చేందుకు భయపడిపోతున్నారు. ఒక ముస్లిం ఒంటరి అమ్మాయికి ఇల్లు దొరకడం దాదాపు అసాధ్యం" అంటూ చెప్పుకొచ్చింది హాట్ భామ ఉర్ఫీ జావేద్.


Click it and Unblock the Notifications











