హొలీ రోజు ఉర్ఫీ మరో వింత.. కుర్రాళ్ళకు ఏం కావాలో అదే చూపిస్తూ.. వీడియో వైరల్
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక రేంజ్ లో క్లిక్కయితే గాని కొందరు గ్లామర్ డోస్ పెంచరు. కానీ ఉర్ఫీ జావేద్ మాత్రం సినీరంగం మీద మక్కువ పెంచుకుని అన్ని లిమిట్స్ దాటేసి సినిమాల కోసం ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పుట్టి పెరిగిన ఈ భామ సినిమా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అంతగా క్లిక్ కావడం లేదు. అయినప్పటికీ తన వింత డ్రెస్ లతో కెమెరాలకు పోజులివ్వడం తగ్గించడం లేదు. ఇక హొలీ పండగ రోజు అమ్మడు మళ్ళీ వింత డ్రెస్ తో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ క్రేజ్
ఒక యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ కూడా పూర్తి చేసిన ఉర్ఫీ ఆ మోడల్ గా అడుగులు వేయాలని అనుకుంది. అనంతరం బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఎక్కువగా బుల్లితెర మీదే కనిపిస్తూ వచ్చిన ఈ భామ 2021 లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ఒక్కసారిగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

వింత బట్టలు..
అదే ఏడాది పంచ్ బీట్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. కానీ అదేమీ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే ఎప్పటికప్పుడు వింత డ్రెస్ లను తానే డిజైన్ చేసుకుని ఆ డ్రెస్సుల్లో ఫోటోలకు ఫోజులిస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. తాజాగా హోలీ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్ ఇప్పుడు రచ్చ లేపుతోంది.

హొలీ రోజు ఇలా..
సాధారణంగా ఎవరైనా హోలీ అంటే తెల్ల బట్టలకు పూర్తిగా దూరంగా ఉంటారు. కానీ ఈ భామ పైన ఎద భాగాన్ని కవర్ చేస్తూ కింద లెగ్స్ అందాలను తెలివిగా కవర్ చేస్తూ కవర్లు చుట్టుకున్నట్టుగా ఉన్న తెల్లటి డ్రెస్ ధరించింది. ఒక చేతికి ఫుల్ స్లీవ్ మరో చేతికి పావు వంతు స్లీవ్ తో కింద కాళ్ల భాగం కవర్ చేసే విధంగా కనిపిస్తోంది. గతంలోనే బికినీలో చాలాసార్లు కనిపించిన ఈ బ్యూటీ ఈసారి అంతకంటే ఘాటైన అందాలతో షాక్ ఇచ్చింది.
గ్లామర్ తో షాక్
తర్వాత హ్యాపీ హోలీ అని చెబుతూ ఈ భామ రంగులు గాల్లోకి విసరడమే కాదు అదే చేతులతో తన ఎద భాగాన్ని కూడా టచ్ చేయడంతో అక్కడ కూడా రంగులను హైలెట్ చేసింది. ఇక తన వింత డ్రెస్ లో ఆమె నడవలేక ఇబ్బంది పడుతూ ముందుకు సాగుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి హ్యాపీ హోలీ అంటూ కామెంట్ చేసింది.
వెనక్కి తగ్గకుండా..
దీంతో ఆమె షేర్ చేసిన డ్రస్సుల మీద రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని కామెంట్స్ వచ్చిన ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా వింత డ్రెస్ లలో కనిపించడం ఆపడం లేదు. ఎప్పటికైనా మంచి సినిమా అవకాశాలు రాకపోవా అని అమ్మడు ఎదురు చూస్తోంది. ఆ మధ్య సినిమా అవకాశాలు వస్తున్నాయని ప్రచారం చేసుకున్న ఉర్ఫీ మంచి కంటెంట్ ఉన్నవి రాకపోవడంతో రిజెక్ట్ చేస్తున్నట్లు కూడా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











