షూటింగ్‌లో ప్రమాదం.. క్రేజీ హీరోకు తీవ్రగాయాలు.. ముఖానికి 13 కుట్లు.. ఏమైందంటే

Recommended Video

Vicky Kaushal Fractures Cheekbone While Shooting || Filmibeat Telugu

యూరి: ది సర్జికల్ స్ట్రయిక్స్ చిత్రం భారీ సక్సెస్ అందుకొన్న వికీ కౌషల్‌ ప్రమాదానికి గురయ్యారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో తీవ్ర గాయాల పాలయ్యాడు. యూరి చిత్రం తర్వాత వికి కౌశల్ ఓ హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భాను ప్రతాప్ సింగ్ దర్శకుడు. గాయపడిన వికీని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకొంటున్నట్టు సమాచారం.

గుజరాత్‌లో షూటింగ్‌.. ప్రమాదంలో గాయం

గుజరాత్‌లో షూటింగ్‌.. ప్రమాదంలో గాయం

వికీ కౌశల్ తదుపరి చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని అలంగ్‌లో జరుగుతున్నది. ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రేకింగ్ యార్ట్‌లో జరుగుతున్నది. కొద్దిరోజులుగా నిర్విరామంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా షిప్‌లో షూట్ చేస్తున్న యాక్షన్ సీన్ల నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. షిప్‌లోని ఓ భాగం విరిగిపడటంతో ఈ ఘటన‌లో ఆయన గదవ ఎముక విరిగింది. గాయానికి దాదాపు 13 కుట్లు వేసినట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

విమానంలో ముంబైకి తరలింపు

విమానంలో ముంబైకి తరలింపు

షూటింగ్ జరుగుతుండగా ఓ డోర్ విరిగి మీద పడింది. దాంతో ఆయన ముఖం పక్కన తీవ్ర గాయమైంది. గదమ ఎముక విరగడంతో వెంటనే ప్రాథమిక చికిత్స చేశాం. అనంతరం వెంటనే విమానంలో ముంబైలోని హాస్పిటల్‌కు తరలించాం. చిన్నపాటి సర్జరీ అనంతరం కుట్లు వేసి చికిత్స చేశారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొంటున్నాడు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

శరవేగంగా షూటింగ్‌తో

శరవేగంగా షూటింగ్‌తో

వికి కౌశల్ గత కొద్దిరోజుల క్రితం వరకు ఈ సినిమా కోసం ముంబైలో షూటింగ్ చేశారు. అనంతరం ఈ సినిమా షూటింగ్ గుజరాత్‌కు మార్చారు. జనవరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసి శరవేగంగా షూటింగ్ ముగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నది.

యూరీ తర్వాత విభిన్నమైన

యూరీ తర్వాత విభిన్నమైన


యూరి తర్వాత విభిన్నమైన హారర్ చిత్రంలో వికీ కౌశల్ నటిస్తున్నాడు. యూరి అందించిన విజయోత్సహావంతో దర్శకుడు భాను ప్రతాప్ సింగ్ చెప్పిన కథ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంచి కామెడీ, హారర్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంటున్నది. అయితే రెండు వారాలో విశ్రాంతి తర్వాత మళ్లీ వికీ కౌశల్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ సినిమాలో వికీ, భూమి కలిసి నటిస్తుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X