twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోమాలు నిక్కబొడిచేలా ‘యూరీ-ది సర్జికల్‌ స్ట్రైర్’ ట్రైలర్

    |

    ఇండియన్ ఆర్మీ చరిత్రలోనే అత్యంత హేయమైన దాడి యూరి సెక్టార్ల‌లోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి. ఈ ఘటనలో 19 మంది సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగా సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం 'యూరి-ది సర్జికల్ స్ట్రైక్'.

    తాజాగా ఈ మూవీ ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తుండగా. విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి, మోహిత్ రైనా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    URI movie Official Trailer

    ''18 సెప్టెంబర్, 2016న కాశ్మీర్‌లోని యూరి బేస్ క్యాంపులో 19 మంది నిరాయుధులైన సైనికులు బలయ్యారు. గడిచిన 20 ఏళ్లలో డెడ్లియెస్ట్ ఎటాక్'' అనే క్యాప్షన్‌తో మొదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

    ఉగ్రవాదుల దాడికి ప్రతికారంగా... పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సైన్యం సర్జికల్ స్ట్రైక్ జరిగిన తీరును ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు నేతృత్వం వహించే ఆర్మీ కమాండర్ పాత్రలో విక్కీ కౌశల్ అదరగొట్టారు. యామి గౌతమ్ ఈ మూవీలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

    భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ జరిగిన తీరును వెండితెరపై రొమాలు నిక్కబొడిచే స్థాయిలో తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జనవరి 11న యూరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    The first trailer for Uri: The Surgical Strike was released on Wednesday. Uri: The Surgical Strike is an upcoming 2019 Indian action film written and directed by debutant Aditya Dhar and produced by Ronnie Screwvala under his banner RSVP Movies. Starring Vicky Kaushal, Paresh Rawal and Yami Gautam, the film is based on the 2016 Indian Army's surgical strikes on Pakistan as a retaliation for the Uri attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X