'యూరి-ది సర్జికల్ స్ట్రైక్' సినిమా మళ్లీ రిలీజ్... ఆ ఒక్కరోజే!

కాశ్మీర్‌ యూరి సెక్టార్ల‌లో 2016లో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందిన చిత్రం 'యూరి-ది సర్జికల్ స్ట్రైక్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి, మోహిత్ రైనా ముఖ్య పాత్రలు పోషించారు.

జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. విడుదలైన 50 రోజల్లోనే రూ. 230 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ ఫుల్ రన్‌లో రూ. 342 కోట్లు రాబట్టింది. కేవలం రూ. 45 కోట్ల బడ్జెట్‌ మాత్రమే ఖర్చయిన ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Uri: The Surgical Strike hit the screens on July 26

జులై 26న కార్గిల్‌ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే సినిమాను ప్రదర్శించనున్నారట. 'ఇండియన్ ఆర్మీ దేశం కోసం చేస్తున్న సేవలను గుర్తుచేసేందుకే ఈ సినిమాను తీశాం. కార్గిల్‌ విజయ్ దివస్‌ సందర్భంగా ముంబైలోని 500 థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం' అని నిర్మాత రోనీ స్క్ర్యూవాలా తెలిపారు.

పుల్వామా ఉగ్రవాదుల దాడి తర్వాత భారత సైన్యం ప్రతికార చర్యల్లో భాగంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ వివామానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి వెయ్యి కిలోల బాంబులను ఉగ్రవాద శిబిరాలపై జార విడిచి దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమార్చారు. దీనిపై త్వరలో 'సర్జికల్ స్టైక్ 2' మూవీ తీసేందుకు పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X