మెరుపు దాడుల తర్వాత.. 'యురి ది సర్జికల్ స్ట్రైక్' సినిమా పరిస్థితి ఇది!
పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి 49 మంది భారత జవానులని బలిగొన్న సంగతి తెలిసిందే. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యకు సరైన ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళాలు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్థావరాలు ఉన్న ప్రాతంలో 1000 కేజీల బాంబుని విసిరింది. ఈ విధ్వంసానికి 200మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలసిపోయారు. ఇదిలా ఉండగా 2016లో ఇలాంటి ఘటనే జరిగింది. యురి ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడిలో దాదాపు 17మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది.

ఊహించని విధంగా
పుల్వామా ఘటన తర్వాత ఇలాంటి ప్రతీకార చర్య ఏదో చేస్తుందని అంతా ఊహించారు. కానీ ఇంత భారీ స్థాయిలో అని ఎవరూ ఊహించలేదు. 2016లో యురి దాడి తర్వాత ఇలాంటి అంచనాలేవి లేవు. సైలెంట్ గా పాక్ లోని ఉగ్ర స్థావరాలపై అటాక్ చేసిన ఇండియన్ ఆర్మీ సైలెంట్ గా పని పూర్తి చేసుకుని వచ్చేశారు. ఆ తర్వాత నిదానంగా ఈ వార్తని మీడియాకు వివరించారు. ఇండియన్ ఆర్మీపై ఒక్కసారిగా ప్రశంసల జల్లులు కురిశాయి.

యురి ది సర్జికల్ స్ట్రైక్
యురి ఘటనపై బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ యురి ది సర్జికల్ స్ట్రైక్ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించాడు. యామి గౌతమ్, మోహిత్ రైనా, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో సంచలన విజయం సాధించింది.

పెరిగిపోతున్న డౌన్‌లోడింగ్
తాజాగా పాక్ పై భారత వైమానిక దళాలు సర్జికల్ స్ట్రైక్స్ జరపడంతో అంతా సర్జికల్ స్ట్రైక్ జపం చేస్తున్నారు. దీని ప్రభావంతో యురి చిత్రానికి ఆన్లైన్ లో పైరసీ డౌన్‌లోడింగ్ అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. యురి చిత్రం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఆన్లైన్ లో వెతుకున్నారట. యురి ఘటన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కమండర్సే వెళ్లి సర్జికల్స్ స్ట్రైక్స్ చేసి వచ్చారు. ఈ సారి భారత ప్రభుత్వం వైమానిక బలగాలని ఉపయోగించుకుంది.

సినీ ప్రముఖుల ప్రశంసలు
తాజాగా పాక్ పై భారత వైమానిక దళాలు దాడి జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో సినీ ప్రముఖులంతా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కమల్ హాసన్, అభిషెష్ బచ్చన్, మహేష్ బాబు లాంటి స్టార్స్ అందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సలాం కొడుతున్నారు. పాకిస్థాన్ కూడా ఈ దాడుల్ని ధ్రువీకరించింది.


Click it and Unblock the Notifications











