22 రోజులైంది, నా భర్త ఆందోళనగా ఉన్నారు: నటి ఊర్మిళ

సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఊర్మిళా మండోద్కర్ కశ్మీర్‌‌లో నెలకొన్న పరిస్థితిపై రియాక్ట్ అయ్యారు. ఆగస్టు 4 నుంచి భద్రత పేరుతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆంక్షలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 22 రోజులుగా తన భర్త వారి తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. ఊర్మిళా వివాహం కశ్మీర్‌కు చెందిన మోసిన్ అక్తర్ మీర్‌తో 2016లో జరిగింది. ఊర్మిళా అత్తా మామ కశ్మీర్లో ఉంటున్నారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో కశ్మీర్ వ్యాప్తంగా భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ''ఇక్కడ ప్రశ్న ఆర్టికల్ 370 రద్దు చేయడం గురించి మాత్రమే కాదు, ఇది అమానవీయ పద్ధతిలో జరిగింది'' అని ఊర్మిళ వ్యాఖ్యానించారు.

Urmila Matondkar expressed concern over ongoing security restrictions in Kashmir

తన అత్తమామలు డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఉర్మిళ వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళనకరంగా ఉంది. వారితో మాట్లాడక 22వ రోజులైంది, వారికి మందులు అందుబాటులో ఉన్నాయో.. లేవో ఏ విషయుం కూడా మాకు తెలియడం లేదు అని ఊర్మిళ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆగస్టు 5న రాజ్య సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్‌గా విభజించారు.

రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' మూవీతో పాపులర్ అయిన ఊర్మిళ బాలీవుడ్, తెలుగు చిత్రాల్లో నటించారు. ముంబైలో సెటిలైన కశ్మీరీ మోడల్, వ్యాపారవేత్త మోసిన్ అక్తర్ మీర్‌‌ను పెళ్లాడారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X