Just In
Don't Miss!
- News
కడప యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శివసేనలో చేరిన ‘రంగీలా’.. ఊర్మిళ ఫోటోలు వైరల్
సినిమాలు, రాజకీయాలు ఎప్పుడూ పెనవేసుకునే ఉంటాయి. సినిమాల్లో సక్సెస్ అయిన తారలు రాజకీయాల వైపు మొగ్గు చూపడం సర్వ సాధారణం. అలాగే పార్టీలు మారడం కూడా ఎంతో సహజం. ఈ క్రమంలో రంగీలా ఫేమ్ ఊర్మిళా మటోండక్కర్ శివ సేన తీర్థాన్ని పుచ్చుకుంది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరింది. అయితే ఆ మధ్య బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కంగనాను వ్యతిరేకించి.. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినప్పుడే ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి.
త్వరలోనే ఊర్మిళా శివ సేనలో చేరనుందని రూమర్లు వచ్చాయి. అవి ఈ రోజు నిజమయ్యాయి. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్‌లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే శివ బంధన్‌ను కట్టి ఊర్మిళకు పార్టీ సభ్యత్వం అందించారు.

ఊర్మిళ మతోండ్కర్ 2019 సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి తరువాత పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ముంబై యూనిట్‌పై అసంతృప్తి కారణంగా ఆమె ఆ పార్టీని విడిచిపెట్టారు. పార్టీలో చేరిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఆమె విడిచిపెట్టారు. మరాఠీ చిత్రం 'జాకోలా' (1980)తో ఊర్మిళా బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఆర్జీవీ రంగీలా, సత్య, భూత్ చిత్రాలతో బాగా ఫేమస్ అయింది.
