ఊర్వశి రౌతెలాతో రిలేషన్ కు రిషబ్ పంత్ గుడ్ బై.. వాట్సాప్ లో బ్లాక్ చేసుకుని మరీ.. ఎందుకంటే?

బాలీవుడ్ కి క్రికెట్‌ కి మధ్య వీడదీయని బంధం ఏదో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శర్మ, గీతా బస్రా, సాగరిక గట్కా, షర్మిలా టాగూర్ తమ తమ లైఫ్ పార్టనర్స్‌గా క్రికెటర్లనే ఎంచుకున్నారు. అప్పటి పటౌడీ నుంచి బాలీవుడ్ - క్రికెట్ ప్రేమయాణాలు కొనసాగుతూనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా కూడా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ బంధానికి బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Recommended Video

Rishabh Pant Blocks Urvashi Rautela On Whatsapp ||
 చెట్టాపట్టాలేసుకొని

చెట్టాపట్టాలేసుకొని

ఊర్వశి రౌతెలా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది కానీ ఈ ఇద్దరూ కూడా తమ రిలేషన్ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించనప్పటికీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరా కంటికి కూడా చిక్కారు.

మొదటి సారిగా ఈ ఇద్దరూ

మొదటి సారిగా ఈ ఇద్దరూ

మొదటి సారిగా ఈ ఇద్దరూ భారత్‌-వెస్టిండీస్‌ టీ20 సిరీస్ సందర్భంగా ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో డిన్నర్‌ చేస్తూ కనిపించారు. దీంతో ఈ ఇద్దరూ డేటింగ్‌ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం మొదలైంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ నమ్మారు. దానికి తగ్గట్టే టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా ఊర్వశి హాజరవ్వడం.. రిషభ్ పంత్‌ను ఉత్సాహపరుస్తూ గ్యాలరీలో సందడి కూడా చేయడంతో ఈ ప్రచారం నిజమేనని నమ్మరు.

 ఒకరినొకరు బ్లాక్ చేసుకోవాలని

ఒకరినొకరు బ్లాక్ చేసుకోవాలని

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ -పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఊర్వశి రౌతేలా హాజరైంది. జాతీయ జెండాను ఊపుతూ పంత్‌ను ఎంకరేజ్ చేసింది. అయితే ఏమయిందో ఏమో తెలియదు కానీ ఆశ్చర్యకరంగా, ఇద్దరూ వాట్సాప్‌లో ఒకరినొకరు బ్లాక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. పరస్పర అంగీకారంతో ఈ ఇద్దరూ తమ వాట్సాప్ నెంబర్లను బ్లాక్ చేసుకున్నారని చెబుతున్నారు.

 ఇష్టపడలేదు

ఇష్టపడలేదు

పింక్‌విల్లా నివేదిక ప్రకారం, ఊర్వశి రౌటేలా రిషబ్ పంత్‌తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది, కానీ అతను వారి మధ్య "రిలేషన్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఇష్ట పడలేదు". అయితే, ఈ ఆరోపించిన సంబంధం గురించి ఊర్వశి లేదా రిషబ్ ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడలేదు.

హాట్ టాపిక్ గా

హాట్ టాపిక్ గా

2019లో, రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు. డెహ్రాడూన్ కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ ఇషా నేగిని తొడలపై కూర్చోబెట్టుకొని దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు.'నీవు ఎప్పటికీ సంతోషంగా ఉండేలా చూస్తా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఐపీఎల్ 2021 సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా రిషబ్ పంత్ యూఏఈ వెళ్లగా.. ఇషా నేగి కూడా యూఏఈ పర్యటనకు వెళ్లింది. అయితే మొత్తం మీద వీరిద్దరి బ్రేకప్ వ్యవహారం మాత్రం అటు బాలీవుడ్ సహా క్రికెట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X