ఎవరికీ డూప్లికేట్‌ని కాదు.. ఐశ్వర్య రాయ్‌తో పోలికపై మండిపడ్డ బాలయ్య హీరోయిన్
ఐశ్వర్యరాయ్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో భారతీయ చిత్ర పరిశ్రమకు దశాబ్ధాలుగా ఐకాన్‌గా వెలుగొందుతున్నారు. అనేక ప్రతిష్టాత్మక ఈవెంట్స్, వేడుకల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ దేశానికి కీర్తి, ప్రతిష్టల్ని తెచ్చిపెడుతున్నారు. భారతదేశంలో ప్రస్తుత తరంలో హీరోయిన్లను అందంతో పోల్చుతారు. ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. అలాంటిది తనను ఐశ్వర్యరాయ్‌తో పోల్చొద్దని మండిపడుతోంది ఓ నటి. ఈ వివరాల్లోకి వెళితే..
ఘనంగా ముగిసిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కేన్స్ ఫెస్టివల్ 2025 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ప్రపంచ నలుమూలల నుంచి అన్ని దేశాలకు చెందిన సినీ నటులు, మోడల్స్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హీరోయిన్లకైతే ఇక్కడి రెడ్ కార్పెట్‌పై విభిన్న దుస్తుల్లో అందాల ప్రదర్శన ఓ ఘనత. ఇందుకోసం ఎదురుచూసేవారు, సన్నద్ధమయ్యేవారు ఎందరో. భారతదేశం నుంచి కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు. మనదేశంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఐశ్వర్య రాయ్ .. ఐశ్వర్య అంటే కేన్ ఫెస్టివల్ అన్నంతగా ఆమె ముద్రవేశారు.

ఐశ్వర్యరాయ్‌కి కేన్స్‌తో అనుబంధం
ఐశ్వర్యకు కేన్స్ ఫెస్టివల్‌తో ఉన్న అనుబంధం అలాంటిది. 2002లో తొలిసారిగా ఈ వేదికపై మెరిసిన ఐష్.. నాటి నుంచి ప్రతి యేడాది క్రమం తప్పకుండా ఈ ప్రఖ్యాత వేదికపై కనిపించేవారు. ఈ ఏడాది జరిగిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఐశ్వర్య హాజరయ్యారు. ఈసారి భారతీయ వివాహితలు ధరించేలా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. బెనారస్ శారీ, వజ్రాలు పొదిగిన నెక్లెస్‌తో కనిపించారు. అంతేకాదు నుదుటిన పెట్టుకున్న సింధూరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నుదుటిన సింధూరంతో కేన్స్‌లో ఐష్
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల ఊచకోతకు ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌తో విరుచుకుపడి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీనికి ప్రతీకగా ఐశ్వర్య సిందూరం ధరించారు. అలాగే అభిషేక్ బచ్చన్‌తో ఐష్ విడిపోతున్నట్లుగా కొద్దినెలలుగా గాసిప్స్ వస్తున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి కూడా సిందూరాన్ని పెట్టుకున్నారని బాలీవుడ్ టాక్. ఐశ్వర్యరాయ్‌తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు అలియా భట్, ఊర్వశి రౌతేలా తదితరులు కేన్స్‌లో మెరిశారు. ముఖ్యంగా ఊర్వశి విభిన్నమైన డ్రెస్సులతో అందాల ప్రదర్శన చేసింది. ఈ సందర్భంగా ఆమెను ఐష్‌తో పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెట్టడంపై ఊర్వశి మండిపడ్డారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
ఐశ్వర్యతో నన్ను పోల్చొద్దు
నేను మరొకరిలా డూప్లికేట్‌గా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేనొక బ్లూ ప్రింట్ అని ఊర్వశి పేర్కొన్నారు. డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్ అని.. అయితే నేను నా సొంత చరిష్మాతో ఐష్‌లా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చానని.. నా లుక్, నా స్టైల్ మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఊరుకోండి.. నాపై ఎన్ని విమర్శలొచ్చినా నేనూ ప్రకాశిస్తూనే ఉంటానని ఊర్వశి రౌటేలా ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై ఐశ్వర్య రాయ్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











