ఊర్వశి రటేలా ఫేస్‌బుక్ హ్యాక్.. డబ్బు డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు
బాలీవుడ్ నటి ఊర్వశి రటేలాకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో తన ట్వీట్లను దుర్వినియోగం చేసిన విషయాన్ని ఇంకా ఆమె మరిచిపోకుండానే సోషల్ మీడియాలో ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు వెల్లడించారు. తన ఫేస్‌బుక్‌ను హ్యాక్ కావడంపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ పేజ్‌పై ఏదో కంటెంట్ పోస్టు చేసి ఉందనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఫేస్‌బుక్ పేజ్ హ్యాక్ అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ అకౌంట్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తే స్పందించకండి. అలాంటి మెసేజ్‌లు నేను కానీ, నా టీమ్ గానీ పెట్టినట్టు భావించవద్దు అని ఊర్వశి పేర్కొన్నారు. అంతేకాకుండా హ్యాకర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారు అంటూ ట్విట్టర్ ద్వారా సైబర్ పోలీసులకు తెలిపారు,

ఇటీవల కాలంలో సినిమా ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కావడం తరుచుగా సంభవిస్తున్నది. ఈ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖుల అకౌంట్లు హ్యాక్ కావడం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు సైబర్ భద్రత ఎంత మేరకు అనే చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











