ప్రధాని సందేశం కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ పనీ ఎంతో సులువుగా మారింది. తాము ఇవ్వాలనుకున్న సందేశాన్ని ప్రజలకు చేర్చడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, క్షణాల్లో చేరేలా సహకరిస్తోంది సోషల్ మీడియా. రోజు రోజుకూ దీని ప్రభావం పెరుగుతూ వస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే సోషల్ మీడియా లేనిపోని ట్రోల్స్ బారిన కూడా పడేస్తుంది. తాజాగా హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు అలాంటి పరిస్థితే ఎదురైంది.
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యం స్థిరపడాలని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ "అజ్మీ షబానాకు జరిగిన ప్రమాదం ఆవేదన కలిగించింది. ఆమె వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.

అయితే ప్రధాని పెట్టిన ఆ ట్వీట్ ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టేసి తన ట్విట్టర్ అకౌంట్‌లో తిరిగి పోస్ట్ చేసింది ఊర్వశీ రౌతేలా. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ ప్రారంభించారు. షబానా అజ్మీకి మెసేజ్ పెట్టాలనుకోవడం మంచిదే.. కానీ ఇలా ప్రధాని మోదీ ట్వీట్ ట్వీట్ కాపీ చేయడమేంటని మండిపడుతున్నారు. దీంతో ఊర్వశీ రౌతేలా మరోసారి ఇలా వార్తల్లో నిలిచింది.


Click it and Unblock the Notifications











