బూతు యాప్స్‌లో యవ్వరాలు.. బాలీవుడ్ సెలబ్రెటీల బాగోతాలు బయటపెట్టన ఊర్వశి రౌతేలా

సోషల్ మీడియా యుగంలో ఎక్కడో ఉన్న వారితో పరిచయం పెంచుకునేందుకు కొత్త కొత్త యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ కల్చర్ బాగా పెరిగింది. ఒకప్పుడు ధనవంతులు డేటింగ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు మధ్య తరగతి వర్గాల ఆదాయాలు కూడా పెరగడం.. పైగా విదేశాల్లో చదువులు, ఉద్యోగాల నేపథ్యంలో ఆ సెక్షన్ యువత కూడా డేటింగ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీంతో కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఆశ్చర్యకరంగా కొందరు సెలబ్రెటీలు కూడా ఇలాంటి యాప్‌లలో యాక్టీవ్‌గా ఉంటన్నారట . ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ బయటపెట్టింది.

ఆ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వేల సంఖ్యలో డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అసలు ఏదో, నకిలీ ఏదో కనుక్కోవడం కష్టం. కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు తీయని మాటలతో వలపు వల విసురుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్ని క్లబ్బులు , పబ్‌లు పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అయితే పరువు పోతుందన్న ఉద్దేశంతో జరుగుతున్న మోసాలపై బాధితులు బయటకు రావడం లేదు. ఇది మరింత మంది మోసపోయేందుకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Urvashi Rautela made sensational comments about Bollywood actors on dating apps

ఇకపోతే.. బాలీవుడ్ సెక్సీ బాంబ్ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఆమె సౌత్‌లోనూ హల్‌చల్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మాస్‌కి పూనకాలు తెప్పించింది. ఆ తర్వాత ఏజెంట్, బ్రో సినిమాల్లో ఊర్వశి చేసిన స్పెషల్ సాంగ్స్ ఆమెకు మంచి పేరు తీసుకురావడంతో పాటు అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #NBK109లో ఊర్వశి నటిస్తున్నారు.

సినిమాలతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలు, హాట్ హాట్ ఫోటో షూట్‌లోన ఊర్వశి ఎక్కువ వార్తల్లో ఉంటారు. గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఆమె రిలేషన్‌షిప్ కలకలం రేపింది. మొన్నామధ్య పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌గా పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. పాక్ బౌలర్‌తో ఆమె ప్రేమలో పడిందా, సైలెంట్‌గా షాకిస్తుందా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

మరోసారి ఊర్వశి రౌతేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా డేటింగ్ యాప్స్ గురించి . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను యాంకర్.. ఇటీవల పలువురు బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు డేటింగ్ యాప్‌లో కనిపించడంపై ప్రశ్నించారు. దీనికి ఊర్వశి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ డేటింగ్ యాప్‌లో హృతిక్ రోషన్, ఆదిత్యరాయ్‌తో పాటు పలువురు స్టార్స్ ఉన్నారని , తాము తరచుగా టచ్‌లో ఉండేందుకే ఆ యాప్‌లో జాయిన్ అయ్యామని ఆమె తెలిపారు. దీనిని మరో కోణంలో చూసి .. ఏదేదో ఊహించుకోవద్దని, ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని ఊర్వశి చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X