Rishabh Pant ఆపు నీ ఓవరాక్షన్.. తమ్ముడు అంటూ క్రికెటర్‌కు ఊర్వశి రటేలా స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు అలాగే క్రికెటర్లకు ఎప్పటినుంచో కొన్ని బంధాలు కొనసాగుతున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా చాలావరకు ఒకప్పటి హీరోయిన్ తో లవ్ ట్రాక్స్ కొనసాగించినట్లు కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. డేటింగ్స్ మ్యారేజ్ బ్రేకప్స్ అనేవి వారి మధ్యలో చాలా కామన్ అయ్యాయి. అయితే మొదటిసారి ఒక టీమిండియా క్రికెటర్ పై గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎక్కువగా మాట్లాడకు వెళ్లి సైలెంట్గా క్రికెట్ ఆడుకో అంటూ ఆమె ఇచ్చిన కౌంటర్ మామూలుగా వైరల్ అవ్వడం లేదు. అసలు వీరి మధ్య ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మాటల యుద్ధం
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరు కౌంటర్ ఇచ్చిన తర్వాత మరొకరు అంతకంటే ఎక్కువ స్థాయిలో సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. గత రెండు మూడు రోజులుగా వీరికి సంబంధించిన వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారుతున్నాయి.

అసలు ఏం జరిగిందంటే..
అసలు మొదట ఈ గొడవకు కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే.. గతంలోనే ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఒక ఎయిర్ పోర్ట్ లో గంటల తరబడి ఎదురు చూశాడు అని వారి మధ్యలో ఏదో కొనసాగుతోంది అని వార్తలు వచ్చాయి. ఇక తర్వాత ఊర్వశి కూడా పూర్తి పేరు చెప్పకుండా RP అనే వ్యక్తి తన కోసం ఎదురుచూశాడు అని నేను వరుస షూటింగ్లతో అలసిపోవడం వలన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని తీరా చూస్తే 16 మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పింది. ఇక అతని పేరు RP అని అతను ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేను అని ఊర్వశి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

రిషబ్ కౌంటర్
ఊర్వశి అలా చెప్పడంతో అందరూ కూడా నిజంగానే అతను రిషబ్ పంత్ అని అనుకున్నారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో వెంటనే రిషబ్ పంత్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొంతమంది ఫేమస్ కావడం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతుంటారు.. ప్లీజ్ అక్కా నన్ను వదిలేయండి అంటూ పరోక్షంగా మరొక కౌంటర్ ఇవ్వడంతో అది కూడా వైరల్ గా మారిపోయింది.

వెళ్లి ఆడుకో అంటూ
ఇక రిషబ్ పంత్ అలా సమాధానం ఇవ్వడంతో ఊర్వశి కూడా వెంటనే రియాక్ట్ అయింది.. చొటా భయ్యా వెళ్లి బ్యాట్ బాల్‌తో ఆడుకో.. అలాగే నేను మున్నిని కాదు నీ లాంటి బచ్చా కారణంగా బద్నాం కావడానికి.. అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు రక్షాబంధన్ ట్యాగ్ తో పాటు, ఆర్‌పీ భాటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఊర్వశి మిక్స్ చేసింది. మరి ఈ విషయంలో ఆ క్రికెటర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











